ETV Bharat / opinion

అద్వితీయమే లక్ష్యంగా శ్రమించాల్సిన సమయమిది

కరోనా సంక్షోభం, లాక్​డౌన్ వల్ల నష్టపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఐదేళ్ల క్రితం ప్రకటించిన మేకిన్ ఇండియా విధానం ఇప్పుడు మన కళ్లముందు సురుచిర స్వప్నంగా భాసిల్లుతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ బహుముఖమైతేనే- దేశ స్థిరపురోగమనానికి మంచి బాటలు పడతాయి!

make in india by modi
మేకిన్ ఇండియా
author img

By

Published : Jun 4, 2020, 9:17 AM IST

అయిదేళ్ల క్రితం ప్రధాని మోదీ భారత్‌లో తయారీ (మేకిన్‌ ఇండియా) విధానాన్ని ప్రకటించినప్పుడు, అదొక సమున్నత లక్ష్యం. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఆత్మ నిర్భర్‌ భారత్‌ (స్వావలంబన భారతావని) కోసం ఇటీవల ఇచ్చిన పిలుపు- సాకారం కావాల్సిన సురుచిర స్వప్నం. కుంగిన వృద్ధిరేట్లకు కొత్త చురుకు పుట్టించి స్వావలంబన దిశగా దేశాన్ని నడిపించేందుకు ఉత్పాదక వస్తువులు- యంత్రాలు, మొబైల్‌- ఎలెక్ట్రానిక్స్‌, జెమ్స్‌-జ్యుయలరీ, ఔషధాలు, జౌళి- వస్త్ర పరిశ్రమ వంటి పది కీలక రంగాల్ని కేంద్రం ఇప్పటికే గుర్తించింది. ఏసీలు, ఫర్నిచర్‌, పాదరక్షల దేశీయ తయారీని ప్రోత్సహించేలా లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనల్ని చురుగ్గా పరిశీలిస్తున్న కేంద్ర సర్కారు- ఎలెక్ట్రానిక్స్‌ రంగంలో చైనా ఆధిపత్యానికి 'చెక్‌'పెట్టేలా విస్తృత ప్రోత్సాహకాలతో ముందుకొచ్చింది. ఎలెక్ట్రానిక్‌ విడిభాగాలు, సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహం, మోడిఫైడ్‌ ఎలెక్ట్రానిక్స్‌ తయారీ సముదాయాలు, భారీయెత్తున తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల నిమిత్తం రూ.50వేల కోట్ల పథకాన్ని పట్టాలకెక్కించింది. దీంతో అంతర్జాతీయ దిగ్గజ మొబైల్‌ సంస్థలకు ఇండియా కార్యక్షేత్రమవుతుందని, వచ్చే అయిదేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల విలువైన మొబైల్స్‌ ఉత్పత్తికి రూ.5.89 లక్షల కోట్ల ఎగుమతులకు బాటలు పడతాయని, 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం ఆశిస్తోంది. 2012 నాటి జాతీయ ఎలెక్ట్రానిక్‌ విధానం వేసిన పునాదులపై దేశీయంగా మొబైల్స్‌ తయారీ పరిశ్రమ గొప్పగా ఎదిగి 2019 చివరికి రూ.2,14,000 కోట్ల విలువైన 33 కోట్ల చరవాణుల ఉత్పత్తి; రూ.26వేల కోట్ల విలువైన ఎగుమతులు సాధించింది. రూ.13 లక్షల కోట్ల విలువైన నూరుకోట్ల మొబైల్స్‌ తయారీ, ఏడు లక్షల కోట్ల విలువైన ఎగుమతులే లక్ష్యంగా నిరుడు సరికొత్త జాతీయ ఎలెక్ట్రానిక్స్‌ విధానం వెలుగు చూసింది. రక్షణ వంటి వ్యూహాత్మక రంగాల్లోనూ స్వావలంబనకు ఎలెక్ట్రానిక్స్‌ రంగం చోదకశక్తి కావాలి!

సాంకేతిక పరిజ్ఞానమే దన్నుగా

చిలవలు పలవలు వేసుకుపోతున్న సాంకేతిక పరిజ్ఞానమే దన్నుగా ఎలెక్ట్రానిక్‌ పరిశ్రమ ఏటికేడు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలెక్ట్రానిక్‌ పరిశ్రమ వస్తూత్పాదనల విలువ రూ.136 లక్షల కోట్లని, అందులో ఇండియా వాటా కేవలం 3.3 శాతం(రూ.4.56లక్షల కోట్లు)మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం నిరుడు పార్లమెంటుకు తెలిపింది. ప్రపంచ ఎలెక్ట్రానిక్స్‌, విడిభాగాల ఎగుమతుల్లో ఎకాయెకి 30శాతం వాటా కలిగిన చైనా మీద పూర్తిగా ఆధారపడితే దెబ్బతినిపోతామన్న గుణపాఠాన్ని కరోనా కళ్లకు కట్టిన తరుణంలో- దిగ్గజ సంస్థలు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నాయి. మొబైల్స్‌ తయారీలో రెండో స్థానానికి చేరిన ఇండియా 2025నాటికి వాటి ఎగుమతుల్లో చైనాను అధిగమించాలని సంకల్పిస్తోంది. వచ్చే అయిదేళ్లలో ఎలెక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌, మాన్యుఫాక్చరింగ్‌ (ఈసీడీఎం) రంగంలో రూ.26లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించాలన్న బృహత్‌ లక్ష్యాన్ని జాతీయ విధానం నిర్దేశిస్తున్నా- అధిగమించాల్సిన అవరోధాలు ఎన్నో పోగుపడి ఉన్నాయి. మౌలిక సదుపాయాల లేమి, అధికవడ్డీలు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కొరవడటం, విడిభాగాల తయారీ వ్యవస్థ వేరూనుకొనకపోవడం, పరిశోధన అభివృద్ధి, డిజైన్‌ సామర్థ్యాలు అరకొరగా ఉండటాన్ని కేంద్ర మంత్రే ప్రస్తావించారు. వీటన్నింటివల్లే తక్కిన దేశాలతో పోటీపడలేక పోతున్నామన్న ప్రభుత్వం- ప్రోత్సాహకాలతోనే లక్ష్యాలు సాకారం కాగలవనుకుంటోంది! 5జి, ఐఓటీ, సెన్సర్లు, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, డ్రోన్లు, రోబోటిక్స్‌, ఫొటొనిక్స్‌ వంటివాటిలో అంకుర పరిశ్రమల సృజనల్ని ప్రోత్సహించాలని జాతీయ విధానంలో మోదీ సర్కారు పేర్కొంది. చిప్‌ డిజైన్‌, వైద్యం, ఆటోమోటివ్‌, విద్యుత్‌, వ్యూహాత్మక రంగాల్లోనూ ఎలెక్ట్రానిక్స్‌ విస్తృతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సంకల్పానికి దీటుగా కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ బహుముఖమైతేనే- దేశ స్థిరపురోగమనానికి బాటలు పడతాయి!

ఇదీ చూడండి: పంట ధర నిర్ణయం రైతులకే- స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.