వేసవిలో పుదీనా రసం తాగితే హాయిగా ఉంటుంది. తయారుచేయడమూ సులువే. శరీరానికి కావాల్సిన లవణాలు, పోషకాలను అందిస్తుంది పుదీనా.
గుప్పెడు పుదీనా ఆకులను బాగా కడిగి.. గ్లాసు నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. దీంట్లో కొద్దిగా పంచదార, చిటికెడు ఉప్పు, చెంచా నిమ్మరసం కలపాలి. చక్కెర బదులుగా తేనె కూడా వేసుకోవచ్చు. చివరగా ఐస్‌క్యూబ్స్ వేసుకుంటే చల్లని పుదీనా రసం సిద్ధమవుతుంది.
లాభాలు..
దీంట్లోని బోలెడు పోషకాలు శక్తినిస్తాయి. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. ఈ రసం క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధకం సమస్య కూడా ఉత్పన్నం కాదు.
- ఇదీ చూడండి : మీ ఆరోగ్యం..చల్లగుండ!