ETV Bharat / lifestyle

Health tips: పాదాల పగుళ్లకు చెక్​ పెట్టండిలా!

మీ పాదాలు తరచూ పగులుతున్నాయా? అయితే అవి ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీయచ్చు. అందుకే... ఈ చిట్కాలు పాటించండి.

foot crack treatment in telugu
foot crack treatment in telugu
author img

By

Published : Jun 16, 2021, 12:59 PM IST

  • రాత్రి పడుకునేముందు పాదాల పగుళ్లకు వెన్న లేదా వ్యాజిలిన్‌ రాస్తే మృదువుగా అవుతాయి. పక్కబట్టలకు అంటకుండా సాక్స్‌ లేదా పాత దుప్పటి వేసుకోవచ్చు.
  • నానబెట్టి పొట్టు తీసిన బాదంపప్పు క్రమం తప్పక తింటే కాళ్లు పగలవు.
  • కాళ్లను కొంచెం నాననిచ్చి స్క్రబ్బర్‌ లేదా ప్యూమైన్‌ స్టోన్‌తో రుద్దాలి. తరచూ ఇలా చేస్తే పగుళ్లు పోతాయి.
  • తేనె మంచి యాంటీసెప్టిక్‌. తేనెలో నిమ్మరసం కలిపి పాదాలకు రాయడం వల్ల ఫలితం ఉంటుంది.
  • రాత్రి కొబ్బరినూనెను రాసి ఉదయం రుద్ది కడగాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్‌ గుణాలు పగుళ్లను తగ్గిస్తాయి. ఆలివ్‌, నువ్వుల నూనెలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి.
  • పగిలిన పాదాలకు అరటిపండు గుజ్జు రాయాలి. ఇందులో ఉండే ఎ, బి6, సి విటమిన్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

Health tip:

.

సీజన్‌ మార్పు వల్ల ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే జీర్ణప్రక్రియ ఇబ్బందిపెట్టే అవకాశముంది.

ఇదీ చూడండి: విటమిన్‌ డి'కి ఏంటి సంబంధం..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.