హైదరాబాద్ మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమయ్యారు. మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్న 34 ఏళ్ల దీపిక, 14 ఏళ్ల సాయిలిపి, తొమ్మిదేళ్ల చైతన్య శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
రెండు రోజులుగా కుటుంబసభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మిస్సింగ్.. వీళ్లంతా ఏమైపోతున్నారు..!