నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కిష్టరాయునిపల్లిలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. యువతి తలపై రాయితో కొట్టి... తీవ్రంగా గాయపరిచాడు. తనని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటోందని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం.
యువతిపై దాడి చేసిన అనంతరం మంచినీటి ట్యాంకు మీద నుంచి దూకి యువకుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. యువకుడిని మర్రిగూడ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: చెట్టును ఢీకొన్న కారు...ముగ్గురు యువకులు మృతి