భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండా సమీపంలో వరి కోత మిషన్ను తీసుకు వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇల్లందు నుంచి గుండాల వైపు వెళ్తూ మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఉన్న ఓ పన్నెండేళ్ల బాలుడికి గాయాలు కాగా అతనిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
వరి కోత మిషన్తో ఎత్తుగా వస్తున్న లారీ.. విద్యుత్ తీగలకు కూడా తగలడంతో రెండు స్తంభాలు, విద్యుత్ నియంత్రికలు నేలకూలాయి.
ఇదీ చదవండి: రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నివర్ తుపాన్