ETV Bharat / jagte-raho

మంగళగిరి వద్ద హైడ్రోక్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ లీక్ - ఏపీ వార్తలు

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద హైడ్రోక్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ లీక్ అయింది. డ్రైవర్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాడు. వాహనాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ట్యాంకర్ లీకేజీను ఆపేందుకు యత్నిస్తున్నారు.

GUNTUR ACID ATTACK
మంగళగిరి వద్ద హైడ్రోక్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ లీక్..
author img

By

Published : Sep 29, 2020, 10:38 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ లీక్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి చెన్నైకి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకెళ్తున్న ట్యాంకర్ కు మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద పంచర్ పడింది. ఇదే సమయంలో ట్యాంకర్ నుంచి ఆమ్లం లీక్ అవుతున్నట్లు డ్రైవర్ గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.

వాహనాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి తరలించారు. పోలీసులు వచ్చి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ట్యాంకర్ చుట్టూ నీళ్లు చల్లారు. ప్రత్యేక దుస్తులు ధరించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ట్యాంకర్ లీకేజీ ను అరికట్టేందుకు యత్నిస్తున్నారు. ట్యాంకర్ పాతది అవటంవల్ల లీకేజీకి గురైనట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు.

మంగళగిరి వద్ద హైడ్రోక్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ లీక్..

ఇవీచూడండి: కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.