ETV Bharat / jagte-raho

కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం - Collector Mohammad Abdul Latest News

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కలెక్టర్ వాహన డ్రైవర్ అప్రమత్తంతో... రోడ్డు ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగిందంటే?

Collector Mohammad Abdul escaped the accident
కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Oct 15, 2020, 11:55 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించేందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి రేగొండకు ప్రభుత్వ వాహనంలో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్​ బయలుదేరారు.

రామన్నగూడెం తండా సమీపంలో ప్రధాన రోడ్డుపై అకస్మాత్తుగా ద్విచక్ర వాహనదారుడు అడ్డువచ్చాడు. వెంటనే కలెక్టర్ వాహన డ్రైవర్ అప్రమత్తమై అతన్నీ తప్పించే ఉద్దేశంతో వాహనానికి బ్రేక్ వేస్తూ రోడ్డు కిందికి తీసుకు వెళ్లాడు. దానితో వాహనదారుడు, కలెక్టర్​తో సహా సిబ్బంది అందరూ సురక్షితంగా బయట పడ్డారు.

ప్రమాదం జరిగితే వాహనదారునికి, కలెక్టర్ వాహనం అదుపుతప్పి పడిపోతే కలెక్టర్​కు ప్రాణహాని జరిగేది. కలెక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం నివారించబడింది. వెంటనే రేగొండ పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: చెరువు కత్వాలో పడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.