ETV Bharat / jagte-raho

ఏపీ సీఎం భద్రతా విభాగం ఆర్​ఎస్ఐకి గాయాలు - accident to cm jagan security officer

ఏపీ కృష్ణా జిల్లా కంచికచర్ల శివారులో జరిగిన ప్రమాదంలో ఓ పోలీస్​ అధికారి గాయపడ్డాడు. ద్విచక్ర వాహనం పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో.. ఏపీ సీఎం భద్రతా విభాగం ఆర్ఎస్ఐ నరసింహారావు ఎడమ కాలు విరిగింది.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏపీ సీఎం భద్రతా విభాగం ఆర్​ఎస్ఐ

author img

By

Published : Dec 8, 2020, 3:40 PM IST

ఏపీ కృష్ణా జిల్లా కంచికచర్ల శివారులో ప్రమాదం జరిగింది. సీఎం భద్రతా విభాగంలో ఆర్ఎస్ఐగా పని చేస్తున్న నరసింహారావు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. అదుపు తప్పారు. వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నరసింహారావు ఎడమ కాలు విరిగింది. వాహనంపై ఉన్న యువతికి గాయాలయ్యాయి.

స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన ఇద్దరినీ.. నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్​ఎస్​ఐ నరసింహారావు విధులు నిర్వహించి స్వస్థలమైన మధిరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కదలని బస్సులు.. తెరుచుకోని దుకాణాలు...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.