నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకొంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.
డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి ఆదివారం.. స్నేహితులతో కలిసి రామడుగు ప్రాజెక్ట్‌లో స్నానానికి వెళ్లారు. నీటిలోకి దిగాక అకస్మాత్తుగా నవీన్ రెడ్డి కనిపించకపోవడం వల్ల ఆందోళనకు గురైన స్నేహితులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక జాలరులతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు వెతికినా.. ఆచూకీ లభ్యం కాలేదు. చీకటి పడడం, ప్రవాహ వేగం అధికంగా ఉండడం వల్ల గాలింపు చర్యలకు విఘాతం కలిగింది.
ఇదీ చూడండి: నెల రోజుల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహానికి శవ పరీక్ష