హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్ధానికంగా నివాసముండే సాయికృష్ణ తన భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు.
కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపే అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతుండడంతో భార్య తన బిడ్డతో అతనికి దూరంగా ఉంటోంది.
వీరిద్దరి మధ్య నెలకొన్న గొడవల గురించి పెద్దల సమక్షంలో ఈరోజు పంచాయితీ ఏర్పాటు చేశారు. అతని మృతి పట్ల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా అసుపత్రికి తరలించారు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆస్పత్రి భవనంపై నుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య