ETV Bharat / international

ఇరాక్​లోని అమెరికా కాన్సులేట్​పై రాకెట్ల వర్షం!

author img

By

Published : Mar 13, 2022, 9:35 AM IST

Missile attack Iraq American embassy: ఇరాక్​లోని అమెరికా కాన్సులేట్​పై శనివారం అర్ధరాత్రి క్షిపణుల వర్షం కురిసింది. దౌత్య కార్యాలయం భవనానికి పలు రాకెట్లు ఢీకొట్టటం వల్ల స్వల్పంగా ధ్వంసమైందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భద్రతా అధికారులు తెలిపారు. సుమారు 12 మిసైల్స్​ ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది.

missile attack iraq american embassy
ఇరాక్​లోని అమెరికా కాన్సులేట్​పై రాకెట్ల వర్షం

Missile attack Iraq American embassy: ఇరాక్​ ఉత్తర ప్రాంత నగరం ఇర్బిల్​లోని అమెరికా రాయబార కార్యాలయమే లక్ష్యంగా శనివారం అర్ధరాత్రి మిసైల్స్​ దాడి జరిగింది. సుమారు 12 రాకెట్లు ప్రయోగించినట్లు సమాచారం. అందులో పలు క్షిపణులు దౌత్య కార్యాలయ భవనానికి తాకాయని, అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్​, అమెరికా భద్రతా అధికారులు తెలిపారు.

"ఇర్బిల్​లోని సలాహ్​ అల్​ దిన్​ ప్రాంతంలో ఉన్న అమెరికా కాన్సులేట్​, కుర్దిస్థాన్​ 24 టీవీ స్టేషన్​కు సమీపంలో రాకెట్ల దాడి జరిగింది. పేలుడు దాటికి టీవీ ఛానల్​, కాన్సులేట్​ భవనం కిటికీలు, పలు సామగ్రి ధ్వంసమయ్యాయి. ఇర్బిల్​ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఎలాంటి ప్రభావం లేదు. ఏ ఒక్క విమానం రద్దు కాలేదు."

- ఇరాక్​ భద్రతా అధికారులు.

ఈ క్షిపణులను పొరుగుదేశం ఇరాన్​ నుంచి ప్రయోగించినట్లు తెలిపారు అమెరికా సీనియర్​ భద్రతా అధికారి ఒకరు. అమెరికా జవాన్లలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అయితే, ఎన్ని మిసైల్స్​ ప్రయోగించారు, అవి ఎక్కడ ఢీకొట్టాయనేది స్పష్టత లేదన్నారు. ఈ క్షిపణుల దాడుల్లో ఎవరైనా మరణించారా అనే విషయం కూడా ఇంకా తెలియదని చెప్పారు. ఇరాక్​ అధికారులు సైతం.. ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అయితే, కాన్సులేట్​ వద్ద పలు నిర్మాణాలు ధ్వంసమైనట్లు చెప్పారు. ఇరాన్​ నుంచి బాలిస్టిక్​ మిసైల్స్​ను ప్రయోగించినట్లు తెలిపారు.

సిరియా, డమస్కస్​లో దాడి చేసి.. ఇరాన్​ రెవల్యూషనరీ గార్డ్​కు చెందిన ఇద్దరు సభ్యులను ఇజ్రాయెల్​ హతమార్చింది. డమస్కస్​ దాడిని ఈనెల 9న ఖండించింది ఇరాన్​ విదేశాంగ మంత్రిత్వ శాఖ. ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది. ఈ దాడి జరిగిన కొన్ని రోజుల్లోనే మిసైల్స్​ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: ఉక్రెయిన్​ యుద్ధంలో రసాయన, జీవ 'ఆయుధ' రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.