ETV Bharat / international

'2024 ఎన్నికల బరిలో ఉంటా'.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన - రిపబ్లికన్‌ పార్టీ

అధ్యక్ష పదవికి తాను మరోసారి పోటీ చేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి బాధ్యతల్లో ఉన్న బైడెన్​.. తాజా ప్రకటనతో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున మరోసారి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

us elections 2024
us elections 2024
author img

By

Published : Apr 25, 2023, 4:12 PM IST

Updated : Apr 25, 2023, 5:35 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి తలపడనున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. 2024లో జరగబోయే అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో తాను డెమొక్రటిక్‌ పార్టీ తరఫున మరోసారి పోటీ చేయబోతున్నట్లు బైడెన్‌ వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మళ్లీ.. అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని అమెరికన్లకు బైడెన్‌ పిలుపునిచ్చారు. ప్రతి తరం ప్రజాస్వామ్యం కోసం నిలబడాల్సిన క్షణం ఆసన్నమైందన్నారు. ప్రాథమిక స్వేచ్ఛ కోసం అందరూ ఐక్యంగా ఉంటారని నమ్ముతున్నానని.. 81 ఏళ్ల బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ప్రకటించారు. తాజాగా బైడెన్‌ చేసిన ప్రకటనతో 2020లో పోటీ చేసిన ఇద్దరు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పీఠం కోసం బరిలో దిగుతునట్లు తెలుస్తోంది.

మంగళవారం ఎన్నికల సన్నాహాలు ప్రారంభించిన బైడెన్​.. తాను వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నట్లు ఓ మూడు నిమిషాల ప్రచార వీడియోను విడుదల చేశారు. తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికోవాలంటూ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో అబార్షన్ హక్కులు, ప్రజాస్వామ్య రక్షణ, ఓటింగ్ హక్కులు సామాజిక భద్రతా వంటి అంశాలు.. 2024 ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన సమస్యలని బైడెన్​ అన్నారు.

"ప్రతి తరం.. ప్రజాస్వామ్యం కోసం నిలబడాల్సిన క్షణం ఉంటుంది. వారంతా ప్రాథమిక స్వేచ్ఛ కోసం నిలబడాలి. ఇదంతా మనది అని నేను నమ్ముతాను. అందుకే నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కోసం పోటీ చేస్తున్నాను. మాతో చేరండి. పని పూర్తి చేద్దాం."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ప్రజాస్వామ్యం కోసం పోరాడటానికి, దేశ పురోగతిని కొనసాగించడానికి అందరు కలిసి రావాలని.. భారతీయ మూలాలున్న అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. దేశం అభివృద్ధి చెందడానికి అందరం కృషి చేయాలన్నారు. అమెరికా అధ్యక్ష కోసం తాము మళ్లీ బరిలోకి దిగుతున్నామన్న కమలా హారిస్​.. అందుకోసం మీ అందరి సహాయం కావాలని అమెరికన్లకు ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ సంవత్సరం నవంబర్​లో బైడెన్​కు 80 ఏళ్లు నిండుతాయి. ఒకవేళ 2024 ఎన్నికల్లో ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యంత ఎక్కువ వయస్సులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా బైడెన్​గా మిగులుతారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఎన్నికల్లో.. రిపబ్లికన్​ పార్టీ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికి.. ఆ పార్టీ తరుఫున అధ్యక్ష రేసులో ఇద్దరు భారతీయ అమెరికన్లు పోటీ పడుతున్నారు. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి రిపబ్లికన్​ పార్టీ తరుపున పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Last Updated : Apr 25, 2023, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.