ETV Bharat / international

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి.. నలుగురికి గాయాలు - అమెరికా ఏంజిలిస్​లో కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ఘటన జరిగింది.

us-los-angeles-shooting
అమెరికాలో మరో సారి కాల్పులు
author img

By

Published : Jan 28, 2023, 10:13 PM IST

Updated : Jan 28, 2023, 10:20 PM IST

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. లాస్​ ఏంజిలిస్​లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాలిఫోర్నియాలో ఒక్క నెలలోనే ఇది నాలుగో ఘటన కావడం ఆందోళనకరం. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాల్పులకు గురైన వారిలో.. ముగ్గురు వాహనంలో ఉన్నారని వీరంతా మృతి చెందినట్లు వెల్లడించారు. గాయపడిన నలుగురు బయట నిలబడి ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పులుకు ఎవరు పాల్పడ్డారో తెలియదని, దాని పైనే దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

గత వారం లాస్​ఎంజెల్స్​లోని ఓ డ్యాన్స్ హాల్ వద్ద జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కొద్ది రోజుల తరువాత శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టగొడుగుల ఫామ్ వద్ద కాల్పులు జరిగాయి. ఇక్కడ ఏడుగురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. గత మూడేళ్లలో అమెరికా 600 సార్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Jan 28, 2023, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.