ETV Bharat / international

యుద్ధం వస్తే తగ్గేదేలే.. ఏకే-47 పట్టిన 79 ఏళ్ల బామ్మ - ఆయుధాలు చేతపట్టిన ఉక్రెయిన్ ప్రజలు

Ukraine Russia war: సరిహద్దులో లక్ష మందికి పైగా సైన్యంతో రష్యా కాచుకు కూర్చొంది. ఏ సమయంలోనైనా దాడి చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ ప్రజలు బెదిరిపోవడం లేదు. తమ దేశాన్ని రక్షించుకునేందుకు చిన్నాపెద్దా తేడా లేకుండా కదిలి వస్తున్నారు.

ukraine russia war
ukraine russia war
author img

By

Published : Feb 17, 2022, 9:01 AM IST

Ukraine Russia war: "నేను దృఢమైన సైనికురాలిని కాకపోవచ్చు.. బరువైన ఆయుధాలను మోయలేకపోవచ్చు.. కానీ, నా దేశం కోసం పోరాడం మాత్రం మానను. నా దేశాన్ని ఓడిపోనివ్వను".. ఉక్రెయిన్‌కు చెందిన 79ఏళ్ల బామ్మ వాలెంటినా కోన్‌స్టాంటీనొవాస్కా ఉద్విగ్నంగా చెప్పిన మాటలివి. ఆమే కాదు.. ఉక్రెయిన్‌లో నాలుగేళ్ల చిన్నారి నుంచి వృద్ధుల వరకూ.. ఎవర్ని కదిలించినా ఇదే భావోద్వేగం. రష్యా ఆక్రమణ నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం అక్కడ చిన్నా పెద్దా కదిలి వస్తున్నారు. యుద్ధం ఎదురైతే 'మేము సైతం' అంటూ తుపాకులతో శిక్షణ తీసుకుంటున్నారు.

ukraine russia war
తుపాకీ పట్టిన బామ్మ

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య దశాబ్దాల పాటు జరుగుతున్న వివాదం ఇటీవల మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేసేందుకు అన్ని విధాల సిద్ధమైన రష్యా.. సరిహద్దుల్లో దాదాపు లక్షన్నర మంది సైనికులను మోహరించింది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉండటంతో ఉక్రెయిన్‌ సైన్యం సర్వ శక్తులతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఆ దేశ ప్రజలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. సామాన్య పౌరులు కూడా ఆయుధాల వాడకంపై శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణకు చిన్నారులు, వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

ukraine russia war
బాలుడి చేతిలో భారీ ఆయుధం

తూర్పు ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లో 79 ఏళ్ల వాలెంటినా కూడా ఈ ట్రెయినింగ్‌లో పాల్గొని జాతీయ భద్రతా సిబ్బంది నుంచి ఏకే - 47 తుపాకీని ఎలా ఉపయోగించాలో శిక్షణ తీసుకున్నారు. తుపాకీ చేతబట్టి లక్ష్యానికి గురిపెడుతున్న వాలెంటినా ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వయసు కూడా పక్కనబెట్టి దేశం కోసం ముందుకొచ్చిన వాలెంటినాను ఉక్రెయిన్‌ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందిస్తున్నారు.

ukraine russia war
ఆయుధాలతో ప్రజలు

"ఏదైనా జరిగితే కాల్పులు జరిపేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఇంటిని, నా పిల్లలను, నా నగరాన్ని నేను రక్షించుకుంటాను. నా దేశాన్ని ఎన్నటికీ ఇతరుల చేతుల్లోకి వెళ్లనివ్వను. నేను బలహీనురాలినే కావొచ్చు. కానీ యుద్ధానికి సిద్ధమే" అని చెబుతూ వాలెంటినా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తున్నారు. ఆమెను చూసి యువత, ఇతర వృద్ధులు సైతం ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్నారు. తమ భవిష్యత్‌ తరం సమస్యలో చిక్కుకోకూడదంటే తాము యుద్ధం చేయాల్సిందే అంటున్నారు మరో బామ్మ మరియానా జాగ్లో. అటు చిన్న పిల్లలు కూడా ఆయుధాలు చేతబట్టి యుద్ధ శిక్షణ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.

ukraine russia war
.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా తాజాగా ప్రకటించడంతో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. సరిహద్దుల్లో సైనిక విన్యాసాల్లో పాల్గొన్న తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ నిన్న ప్రకటించింది. ఈ దళాలు ఎక్కడి నుంచి వెనుతిరుగుతున్నాయి.. ఎంత మంది సైనికులు వెనక్కి వచ్చేస్తున్నారన్న వివరాలను వెల్లడించలేదు. కానీ రష్యాను పశ్చిమ దేశాలు విశ్వసించడం లేదు. ఉక్రెయిన్‌పై పొంచి ఉన్న యుద్ధమేఘాలు పూర్తిగా తొలగి పోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ పేర్కొన్నారు. రష్యా దాడి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: 'రష్యాపై నమ్మకం లేదు.. ఉక్రెయిన్‌పై దాడి జరగొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.