ETV Bharat / international

బ్రిటన్​లో సెప్టెంబర్​ నాటికి వయోజనులందరికీ టీకా - కొత్తరకం కరోనా కేసులు బ్రిటన్​

కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం. ఆ దేశంలోని వయోజనులందరికీ సెప్టెంబర్​ నాటికి టీకా మొదటి డోసు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కొత్త రకం వైరస్​ బారిన పడే వారి సంఖ్య నానాటికి అధికమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్​.

uk vaccination
సెప్టెంబర్​ నాటికి వయోజనులందరికీ టీకా: బ్రిటన్​
author img

By

Published : Jan 18, 2021, 12:19 PM IST

కొత్తరకం కరోనా(స్ట్రెయిన్​) కేసులతో అల్లాడుతున్న బ్రిటన్​ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్​ నాటికి దేశంలోని వయోజనులందరికీ(18 ఏళ్లు నిండినవారు) కొవిడ్​ వ్యాక్సిన్​​ మొదటి డోసు వేయాలని నిర్దేశించుకుంది. మరిన్ని టీకా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమవుతోందని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డామ్నిక్​ రొబాబ్ తెలిపారు. తద్వారా నిరంతర వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని నెలకొల్పుతామని చెప్పారు.

వారి తర్వాతే..

ఆరోగ్య సిబ్బంది, కరోనా యోధులతో పాటు 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ మొదటి డోసు వేసేందుకు బ్రిటన్​ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్​ వేయనుంది. అయితే.. బ్రిటన్​ జనాభాలో దాదాపు 60 శాతం మందికి పైగా వయోజనులే ఉండటం గమనార్హం. వైరస్​ వ్యాప్తి పెరుగుదలపై ఆ దేశ జాతీయ ఆరోగ్య సేవల(ఎన్​హెచ్​ఎస్​) సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ విస్తృత స్థాయి వ్యాక్సినేషన్​ కార్యక్రమానికి బ్రిటన్​ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ దేశంలో ప్రతి 30 సెకన్లకు ఓ కరోనా కేసు నమోదవుతోందని ఎన్​హెచ్​ఎస్​ పేర్కొంది.

కొనసాగుతున్న లాక్​డౌన్​..

వైరస్​ను కట్టడి చేసేందుకు మూడో దశ లాక్​ డౌన్​ను బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్.. జనవరి 2న విధించారు. ఫిబ్రవరి మధ్య వరకు ఈ లాక్​డౌన్​ ఆంక్షలను సడలించేది లేదని స్పష్టం చేశారు. మిగతా దేశాల్లా కాకుండా టీకా డోసుల మధ్య వ్యవధిని 21 రోజల నుంచి 12 వారాలకు పెంచుతూ బ్రిటన్​ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అందరికీ కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు ఈ విధానాన్ని పాటిస్తోంది. బ్రిటన్​లో ఫైజర్​, కొవిషీల్డ్​, మోడెర్నా టీకాలు అనుమతి పొందాయి. మోడెర్నా టీకాను వసంతకాలం నుంచి వినియోగించనున్నారు.

బ్రిటన్​లో కరోనా బారిన పడి తాాజాగా 37,475 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 88,747 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన 5వ దేశంగా బ్రిటన్​ నిలిచింది.

ఇదీ చూడండి:'ప్రపంచానికి ఔషధ నిలయంగా భారత్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.