ETV Bharat / international

'బ్రెగ్జిట్ కీలక అంశాలపై చర్చలు కొనసాగించాలి'

బ్రెగ్జిట్​ అనంతరం జరుగుతున్న చర్చలను కొనసాగించాలని బ్రిటన్, ఈయూ వర్గాలు తేల్చాయి. శనివారం బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​​, యూరోపియన్​ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డెర్​ లియెన్​తో ఫోన్​లో సంభాషించారు. ప్రస్తుత పరిస్థితులపై సోమవారం మరోసారి ఫోన్​లో చర్చించనున్నారు.

UK Prime Minister, European Commission chief agree to continue post-Brexit talks on Monday
బ్రెగ్జిట్ కీలక అంశాలపై చర్చలకు ఇరు వర్గాలు సుముఖత
author img

By

Published : Dec 6, 2020, 11:47 AM IST

ఐరోపా​ సమాఖ్య(ఈయూ) నుంచి జనవరిలో వైదొలిగిన బ్రిటన్​.. ప్రస్తుతం జరుపుతున్న చర్చలను కొనసాగించాలని తీర్మానించింది. శనివారం బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్​సన్​, యూరోపియన్​ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డెర్​ లియెన్​తో ఫోన్​లో సంభాషించారు. సోమవారం మరోసారి ఫోన్​లో చర్చించనున్నారు.

"ప్రస్తుతం బ్రిటన్, ఈయూల మధ్య కొనసాగుతున్న చర్చల్లో పురోగతి సాధించాము. చాలా విభాగాల్లో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. కానీ పరిపాలన, మత్స్య సంపద తదితర అంశాల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి."

--బ్రిటన్​ ప్రధాన మంత్రి కార్యాలయం

ముఖ్యమైన అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చర్చలు కొనసాగించాల్సి ఉందని బ్రిటన్​ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఇరువర్గాల ప్రతినిధులు సోమవారం బ్రుసెల్స్​లో చర్చించనున్నారని వెల్లడించింది.

ఇదీ చదవండి : బ్రెగ్జిట్​ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.