ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నూతన డైరెక్టర్ జనరల్‌గా నైజీరియాకు చెందిన నగోజీ ఒకోంజో ఐవియోలా నియమితులయ్యారు. దీంతో డబ్ల్యూటీఓ అత్తున్నత పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్‌గా ఆమె చరిత్రలో నిలిచిపోయారు.
66ఏళ్ల ఓకోంజోను 164 దేశాల ప్రతినిధుల డైరెక్టర్ జనరల్‌గా ప్రకటించారు. దేశాల మధ్య వాణిజ్య నియమాలతో వ్యవహరించేలా డబ్ల్యూటీఓను తయారు చేస్తామని ఆమె పేర్కొన్నారు.
కొవిడ్-19 కారణంగా చిన్నాభిన్నమైన ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య రంగాలను గాడిలో పెట్టేందుకు అవసరమైన విధానాలు అమలు చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఓకోంజో పేర్కొన్నారు. "డబ్ల్యూటీఓ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. సమష్టిగా పనిచేయడం ద్వారా సంస్థను మరింత బలంగా, చురుకైన వ్యవస్థగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుతాం" అని ఓకోంజో ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చూడండి: వార్తలకు డబ్బులిచ్చేలా గూగుల్ భారీ ఒప్పందం