ETV Bharat / international

భారత్- ఫ్రాన్స్ కీలక నిర్ణయాలు- రక్షణ రంగంలో ముందడుగు - భారత్-ఫ్రాన్స్ ఒప్పందం

భారత జాతీయ సలహాదారు అజిత్ డోభాల్.. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల (India France relations) మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇండోపసిఫిక్​పై సహకారం... సముద్ర, అంతరిక్ష, సైబర్ రంగంల్లో సరికొత్త ప్రణాళికలను రూపొందించడంపై అవగాహనకు వచ్చాయి.

ajit doval in france
అజిత్ డోభాల్ ఫ్రాన్స్ పర్యటన
author img

By

Published : Nov 6, 2021, 11:00 PM IST

రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా భారత్-ఫ్రాన్స్​ (India France relations) కీలక ముందడుగు వేశాయి. సమాచార మార్పిడి; సైనిక విన్యాసాలను (India France military exercise) విస్తృతం చేయడం.. ఇరుదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం.. సముద్ర, అంతరిక్ష, సైబర్ రంగంల్లో సరికొత్త ప్రణాళికలను రూపొందించడంపై అవగాహనకు వచ్చాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ఫ్రాన్స్ (India France relations) అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఎమ్మాన్యూయెల్ బాన్నెతో జరిగిన భేటీలో ఈ మేరకు ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

ajit doval
ఫ్రాన్స్ అధికారితో డోభాల్

మోదీ విజన్ అయిన 'ఆత్మనిర్భర్ భారత్'కు (Atmanirbhar Bharat scheme) తమ మద్దతు ఉంటుందని ఫ్రాన్స్ స్పష్టం చేసినట్లు పారిస్​లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. రక్షణ రంగంలో పారిశ్రామిక విధానం, సంయుక్త పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధి వంటి విషయాల్లో సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా కలిసి ఆకస్ కూటమి (AUKUS France) ఏర్పాటుపై గుర్రుగా ఉన్న ఫ్రాన్స్.. భారత్​తో రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి (India France relations) ముందుకు రావడం విశేషం.

ఉగ్రవాదం, ఇండోపసిఫిక్​పై చర్చ!

పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ యీవ్స్ లె డ్రయాన్​, సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో డోభాల్ భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్​లో ప్రస్తుత పరిణామాలు, అఫ్గాన్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై డోభాల్ చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం పేర్కొంది. నిరంతర సమస్యగా మారిన ఉగ్రవాదంపైనా చర్చలు జరిపినట్లు తెలిపింది.

భద్రతా మండలి సహా ఇతర ఐరాస వేదికల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సన్నిహిత భాగస్వామ్యం ఉండాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ సంస్థల ద్వారా సంప్రదింపులు కొనసాగిస్తూ ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అవగాహనకు వచ్చినట్లు తెలిపింది. సంయుక్తంగా సహకారం అందించుకుంటూనే ఇండోపసిఫిక్​లో అవసరమైన దేశాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది.

ఈ సందర్భంగా ఫ్రాన్స్​ను.. భారత్​కు ఉన్న అతిపెద్ద భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా డోభాల్ అభివర్ణించారని రాయబార కార్యాలయం పేర్కొంది. ఇటీవల ఐరోపా సమాఖ్య తీసుకొచ్చిన ఇండో పసిఫిక్ స్ట్రాటజీని భారత్ స్వాగతించిందని వివరించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.