ప్రపంచంపై పంజా విసురుతోంది కరోనా మహమ్మారి. ఒక్కరోజులో 1,010 మంది వైరస్‌కు బలయ్యారు. కొత్తగా 16,920 మందికి పైగా వైరస్ సోకింది. గత 24 గంటల్లో అత్యధికంగా స్పెయిన్‌లో 399 మంది ప్రాణాలు కోల్పోయారు. బెల్జియంలో 145 మంది మృతి చెందారు. వైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైన అమెరికాలో ఇప్పటివరకు 40,565 మంది మృతి చెందారు. అక్కడ 7 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
చైనాలో తగ్గిన కేసులు..
చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో ఎనిమిది మంది విదేశాల నుంచి వచ్చిన వారని సమాచారం. మిగతా నలుగురికి దేశీయంగా వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. 1,031 మంది బాధితులు వైరస్‌కు చికిత్స పొందుతున్నారు. 77,084 మంది డిశ్చార్జీ అయ్యారు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ స్థాయికి 'వైరస్ వార్'.. వ్యాప్తిపై దుమారం