ETV Bharat / international

'వందేళ్లయినా తాలిబన్లు ఆ పని చేయలేరు!'

అఫ్గాన్​ ప్రభుత్వం మరో వందేళ్లైనా తాలిబన్​ చెరలోకి వెళ్లబోదని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ అన్నారు. దేశంలో జరుగుతున్న రక్తపాతం, విధ్వంసానికి తాలిబన్​, వారి మద్దతుదారులే కారణమని మండిపడ్డారు.

Afghan President Ghani
అష్రఫ్​ ఘనీ
author img

By

Published : Jul 7, 2021, 2:15 PM IST

మరో వందేళ్లు అయినా అఫ్గానిస్థాన్ ప్రభుత్వం తాలిబన్​ల చేతుల్లోకి వెళ్లబోదని ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ అన్నారు. దేశంలో పేట్రేగిపోయిన రక్తపాతానికి, విధ్వంస చర్యలకు తాలిబన్​, వారి మద్దుతుదారులే కారణమని దుయ్యబట్టారు. కాబుల్​లోని అధ్యక్షుని నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.

తాలిబన్​లు దేశ భూభాగాన్ని ఆక్రమించడాన్ని ప్రజలు కోరకోవడం లేదని.. కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆ దేశ భద్రతా సలహాదారుడు హహ్మాదుల్లా ముహిబ్​ పేర్కొన్నారు. త్వరలోనే ఏడు బ్లాక్​ హాక్​ చాపర్లను దేశ రక్షణ, భద్రతా దళాలకు అందజేయనున్నట్లు ప్రకటించారు. వీటి ద్వారా తాలిబన్​ సమస్యను అదుపులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

24 గంటల్లోనే 200 మందికి పైగా తాలిబన్​లను సైన్యం మట్టుబెట్టినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఆరు జిల్లాలను తాలిబన్​ల చెర నుంచి కాపాడినట్లు పేర్కొంది. ఇందుకు సుమారు 10 వేల మంది కమాండోలను దేశవ్యాప్తంగా రంగంలోకి దించినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: కరోనా ఎలా పుట్టిందో తేల్చేసిన నిపుణులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.