ETV Bharat / state

వాహ్‌.. వాహనంలోనే రెండంతస్తుల మేడ - చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

వాహనంలోనే రెండంతస్తుల మేడ - అదే వాహనంలో కుటుంబంతో కలిసి మట్టి పాత్రల అమ్మకాలు

TWO FLOORS IN VEHICLE IN WARANGAL
Man Made Two Floors in Transport Vehicle in Warangal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Man Made Two Floors in Transport Vehicle in Warangal : ''మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది'' అంటూ అలనాటి సుఖ దుఃఖాలు సినిమాలోని ఓ పాట ఇది. ఈ పాట తగ్గట్లుగానే వీరి జీవితానికి అచ్చంగా సరిపోతుందని చెప్పొచ్చు. రాజస్థాన్​లోని అజ్‌మేర్‌కు చెందిన రాందేవ్​ అనే వ్యక్తి తన సరకు రవాణా వాహనాన్ని ఇలా రెండస్తుల అరలుగా తయారు చేశారు. తన కుటుంబంతో వరంగల్​కు వలస వచ్చిన ఆయన, మట్టితో అందంగా తయారు చేసిన వంట పాత్రలు, ఇతర గృహోపకరణాలను విక్రయిస్తున్నారు. ఇలా రోజూ మట్టితో చేసిన పాత్రలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

TWO FLOORS IN TRANSPORT VEHICLE
రెండస్తుల అరలు ఏర్పాటు చేసి కింద మట్టి పాత్రలు విక్రయిస్తున్న రాందేవ్ (ETV Bharat)

విషయం ఏంటంటే తన వాహనంలో రెండస్తుల అరలుగా తయారు చేసుకుని పైఅంతస్తులో వంట, పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కింద తయారు చేసిన మట్టి పాత్రలు పెట్టి విక్రయిస్తున్నారు. బుధవారం హనుమకొండలోని కనకదుర్గ కాలనీ వద్ద మట్టి పాత్ర వస్తువులను అమ్ముతూ ఈటీవీ భారత్​ కెమెరాకు చిక్కారు. దీంతో వారిని సంప్రదించగా దాదాపు 1600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామని, అన్నీ అమ్ముడుపోయాక తన స్వగ్రామానికి వెళ్తామని రాందేవ్‌ చెప్పారు. అక్కడున్న స్థానికులు సైతం వాహనంలో తయారు చేసిన రెండస్తుల అరలను చూసి ఆశ్చర్యపోతున్నారు. కష్టపడాలనే సంకల్పం ఉంటే ఏమీ లేకున్నా బతకొచ్చని కొనియాడారు.

TWO FLOORS IN TRANSPORT VEHICLE
రెండస్తుల అరలు ఉన్న వాహనం (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.