సౌదీ అరేబియాలో మరోసారి సామూహిక మరణ దండన విధించింది అక్కడి ప్రభుత్వం. మూడేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో నిందితులుగా ఉన్న 37 మందికి శిక్ష అమలు చేసింది. రియాద్, మక్కా మదీనా, ఖాసిమ్ ప్రాంతాల్లో ఈ శిక్షలను అమలు చేశారు.
"ఉగ్ర, వేర్పాటు వాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వారికి శిక్షను అమలు చేశారు. అందులో ఓ వ్యక్తికి నేర తీవ్రతను బట్టి శిక్ష అనంతరం శిలువ వేశారు."
-సౌదీ ప్రభుత్వ వార్తా సంస్థ
వివరాల ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు 100 మందికి సౌదీలో మరణ శిక్ష విధించారు.