Ramnath kovind in Bangladesh: పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో విజయానికి 50 వసంతాలు పూర్తైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఢాకాలో నిర్వహించిన నేషనల్ పరేడ్‌ను వీక్షించారు.
Bangladesh vijay diwas:
బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్.. ఆ దేశ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోవింద్.. 1971 కాలం నాటి మిగ్ 21 యుద్ధవిమానం ప్రతిరూపాన్ని అబ్దుల్ హమీద్‌కు బహూకరించారు. ఇరుదేశాల సైన్యాలు చేసిన త్యాగానికి గుర్తుగా దీన్ని అందించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్‌కు వెళ్లారు. ఢాకాలో నిర్వహించే 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో భారత్ తరఫున గౌరవ అతిథిగా హాజరు కావాలని కోవింద్‌ను బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా బుధవారం షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహుముఖ, సమగ్రమైన ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరుపక్షాలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: 'కలిసి పోరాటం చేశాము.. అణచివేత శక్తులను ఓడించాము'