కరోనా (కొవిడ్-19) నియంత్రణ, టీకా రూపకల్పనలో ప్రపంచ దేశాల సహకారానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. మానవాళికి సవాల్‌గా మారిన ఈ మహమ్మారిపై పోరులో అన్ని దేశాలూ చేతులు కలపాలని కోరారు.
వైరస్ అనేక దేశాలను చుట్టుముడుతుండటం వల్ల పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ, పరిశోధన పరంగానూ సహకరించుకోవాలని జిన్‌పింగ్ ఆకాంక్షించారు.
ఇప్పటికే ఈ వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా 3,100కు పైగా మృతి చెందారు. ఒక్క చైనాలోనే కరోనా మృతుల సంఖ్య మంగళవారం నాటికి 2,943కు చేరింది.
- ఇదీ చూడండి: 'కరోనా దెబ్బకు దిక్కుతోచని స్థితిలో ప్రపంచం'