ETV Bharat / international

భారత్‌తో సత్సంబంధాల దిశగా నేపాల్‌ ముందడుగు!

author img

By

Published : Oct 16, 2020, 4:46 AM IST

నేపాల్​ మంత్రివర్గ విస్తరణలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ. రక్షణ శాఖ బాధ్యతలను తానే చూసుకోనున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ పదవి నుంచి ఉప ప్రధాని ఈశ్వర్​ పోఖ్రియాల్​ను తప్పించారు. భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకే ఓలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో భారత్​కు వ్యతిరేకంగా వ్యవహరించిన పోఖ్రియాల్​ను తప్పించడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.

Oli sparks speculation by keeping defence ministry with himself in Cabinet reshuffle
భారత్‌తో సత్సంబంధాల దిశగా నేపాల్‌ ముందడుగు?

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ప్రధాని ఈశ్వర్‌ పోఖ్రియాల్‌ను రక్షణ శాఖ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ శాఖను తానే చూడనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్​ సమావేశంలో నిర్ణయించారు ఓలీ. ఈశ్వర్‌ పోఖ్రియాల్‌ను ప్రధాని కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఫలితంగా ఆయన.. ఏ శాఖ లేని మంత్రిగా కొనసాగనున్నారు. గతంలో ఈశ్వర్‌ పోఖ్రియాల్‌ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు. తాజా చర్యతో భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి కేపీ శర్మ ఓలీ ఒక ముందడుగు వేసినట్లయింది. నవంబర్‌ 3న భారత సైనికాధిపతి మనోజ్‌ ముకుంద్‌ నరవణె నేపాల్‌ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడి మంత్రివర్గంలో ఇలాంటి పరిణామం జరగడం గమనార్హం.

ఘాటుగా స్పందించిన పోఖ్రియాల్​..

కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రికుల కోసం చైనా సరిహద్దులోని లిపులేఖ్‌ వరకు 80 కిలోమీటర్ల రహదారిని భారత్‌ గత మే నెలలో ప్రారంభించింది. దీనిని నేపాల్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త సరిహద్దులతో మ్యాప్‌ను విడుదల చేసింది. దీని వెనుక చైనా హస్తముందని మే నెలలో జనరల్‌ నరవణె అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా దశాబ్దాలుగా భారత్‌ ఆర్మీలో అంతర్భాగమై దేశ రక్షణ కోసం పని చేస్తున్న నేపాల్‌ సైనికుల మనోభావాలను ఆ దేశం దెబ్బతీసిందన్నారు. దీనిపై నేపాల్‌ రక్షణ మంత్రిగా ఈశ్వర్‌ పోఖ్రియాల్‌ తీవ్రంగా స్పందించారు. నరవణె వ్యాఖ్యలతో ఇక నుంచి గూర్ఖా సైనికులు.. ఉన్నతాధికారులు చెప్పిన మాటలను వినబోరని చెప్తూ.. సమస్యను రాజకీయం చేసే ప్రయత్నం చేశారు.

నరవణె పర్యటనకూ వ్యతిరేకత..

మరోవైపు నవంబర్‌ 3న జనరల్‌ నరవణె నేపాల్‌ పర్యటనను కూడా పోఖ్రియాల్‌ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. భారత్‌-నేపాల్‌ సరిహద్దు వివాదం పరిష్కారమైన తర్వాతే ఏదైనా జరగాలని ఆయన బలంగా వాదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆయనను రక్షణ శాఖ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: 'ఆరోగ్యంగా ఉంటే.. టీకా కోసం 2022 వరకు ఆగాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.