నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. పుష్పకమల్ దహల్ 'ప్రచండ' నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు సెంటర్) ఆయనకు మద్దతును ఉపసంహరించగా ఈ బలపరీక్ష అవసరమయింది.
సొంత నేపాల్ కమ్యూనిస్టు పార్టీలోనే ఓలిపై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభ ప్రత్యేక సమావేశం జరగనుంది. 275 మంది సభ్యులుగల ఈ సభలో ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధిస్తానని ఓలి భావిస్తున్నారు.
నేపాల్ పార్లమెంట్‌లో ఓలీ పార్టీ సీపీఎన్-యూఎంఎల్కు 121 సీట్లు ఉండగా సీపీఎన్ఎంకు 49 మంది చట్ట సభ్యులున్నారు.
ఇదీ చూడండి: '2015లోనే కరోనాతో జీవాయుధాల తయారీలో చైనా'