మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న క్రమంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మయన్మార్ కీలక నేత ఆంగ్‌సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రెసీ (ఎన్ఎల్డీ) పార్టీని రద్దు చేయాలని ఆ దేశ ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.
అఖిల పక్షా పార్టీలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది ఆ దేశ ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా ఎన్ఎల్డీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈసీ ఛైర్మన్ థైన్ సోయ్. ఎన్ఎల్డీపై ఏ నిర్ణయం తీసుకుందాం? దానిని రద్దు చేద్దామా? అని వ్యాఖ్యానించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎన్ఎల్డీ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలే తమ ఆలోచనలకు కారణమని పేర్కొన్నారు.
గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో భారీస్థాయిలో అవినీతి జరిగిందని ఈసీ ఛైర్మన్ ఆరోపించారు. ఆ ఎన్నికల్లో ఎన్ఎల్డీ 83 శాతం భారీ మెజారిటీతో విజయం సాధించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని సైన్యం తన అధీనంలోకి తెచ్చుకుంది.
ఇదీ చదవండి : 'టిబెట్' ముసుగులో.. సరిహద్దుల్లో డ్రాగన్ విస్తరణ