ETV Bharat / international

చైనాకు చలి భయం- లద్దాఖ్​ నుంచి రివర్స్ గేర్! - China troops deployed along Ladakh sector

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌తో కయ్యానికి దిగిన చైనాను చలి భయపెడుతోంది. ఎత్తైన పర్వత ప్రాంతంలోని తీవ్రమైన చలి వాతావరణాన్ని ఆ దేశ సైనికులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే అక్కడ ఉన్నవారందరినీ వెనక్కి పంపి.. కొత్త వారిని తీసుకొస్తోంది చైనా.

China Army
చైనా సైన్యం
author img

By

Published : Jun 6, 2021, 4:11 PM IST

ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తి. అగ్రరాజ్యం అమెరికాను సవాల్‌ చేస్తూ శక్తిమంత దేశంగా దర్పం. ఆర్థికంగానూ తిరుగులేదనే బలం. ఇన్ని చూసుకునే తూర్పు లద్దాఖ్‌లో భారత్‌తో సరిహద్దు కయ్యానికి తెరతీసింది పొరుగుదేశం చైనా. భారత భూభాగాన్ని కబళించే కుటిల యత్నానికి పన్నాగం పన్నింది. గత ఏడాది మే-ఏప్రిల్‌లో సరిహద్దు ఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి తూర్పు లద్దాఖ్‌లో 50వేల మంది సైనికులను మోహరించిన చైనా ప్రతికూల వాతావరణానికి తట్టుకోలేక ఇప్పుడు పలాయనం చిత్తగిస్తోంది.

90 శాతం సైన్యం మార్పు..

ఎత్తైన పర్వత ప్రాంతం, తీవ్రమైన చలి వాతావరణానికి చైనా సైనికులు తట్టుకోలేక పోవడంతో 50వేల మంది సైనికుల్లో ఇప్పుడు 90 శాతం మందిని మార్చి కొత్త వారిని మోహరించింది. ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తూ వచ్చిన సైనికులపై ప్రతికూల వాతావరణ ప్రభావం పడడంతోనే వారిని మార్చినట్లు తెలిసింది.

China Army
నియంత్రణ రేఖ వద్ద చైనా ఆర్మీ

భారత సైనికుల సత్తా..

ఇక అదే సమయంలో చైనా సైన్యంతో పోలిస్తే భారత సైన్యం తన సత్తాను గొప్పగా చాటుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని ఎత్తైన ప్రదేశాల్లో, చలి వాతావరణాన్ని తట్టుకుని భారత సైనికులు కనీసం రెండేళ్ల పాటు అక్కడ ఉంటున్నారు. తూర్పు లద్దాఖ్‌లో మోహరించిన జవాన్లలో 40 నుంచి 50శాతం మందిని మాత్రమే ప్రతి సంవత్సరం భారత్‌ మారుస్తూ ఉంటుంది. ఇక ఇండో టిబెటన్‌ బోర్డర్‌ ఫోర్స్‌ సిబ్బందిని కొన్ని సార్లు రెండేళ్ల కంటే ఎక్కువ సమయం కూడా ఒకే చోట మోహరిస్తూ ఉంటుంది.

ప్రతికూల వాతావరణాన్ని అవలీలగా అధిగమిస్తూ భారత సైనికులు సరిహద్దుల వద్ద సమర్ధంగా విధులు నిర్వహిస్తూ ఉండగా, చైనా సైనికులు మాత్రం దాన్ని తట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు. అతిపెద్ద సైనిక శక్తి అనే మాట డొల్లతనమే అని చైనా చాటుకుంటోంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వి భంగపడిన చైనా సైన్యం తన అసలు సత్తా ఇదే అని తేటతెల్లం చేసుకుంటోంది.

ఇదీ చూడండి: '2024లో మోదీ ఓటమి కోసం చైనా కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.