ETV Bharat / international

'గల్వాన్ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయండి' - గల్వాన్ చైనా భారత్

లద్దాఖ్​లో జరిగిన హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులను జవాబుదారీగా చేయాలని భారత్​ను చైనా కోరింది. సైన్యంలో క్రమ శిక్షణ తీసుకురావాలని చెప్పుకొచ్చింది. గల్వాన్ తరహా ఘటనలు జరగకుండా చూడాలని వ్యాఖ్యానించింది.

China asks for thorough investigation on the border incident
'గల్వాన్ ఘటనపై దర్యాప్తు వేగిరం చేయండి'
author img

By

Published : Aug 14, 2020, 2:46 PM IST

గల్వాన్ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని చైనా.. భారత్​ను కోరింది. ఘటనకు కారకులైన వారిని జవాబుదారీని చేయాలని, సైన్యంలో క్రమశిక్షణ తీసుకురావాలని నీతి వాక్యాలు పలికింది. రెచ్చగొట్టే చర్యలను నియంత్రించి గల్వాన్ తరహా ఘటనలు జరగకుండా చూడాలని చెప్పుకొచ్చింది.

హింసాత్మక ఘటనకు తానే కారణమైనప్పటికీ... భారత్​పై పదేపదే ఆరోపణలు చేస్తోంది చైనా. అయితే చైనా వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.

లద్దాఖ్ నుంచి సిక్కిం వరకు విస్తరించి ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో చైనా- భారత్ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. లద్దాఖ్​లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఇటీవల తీవ్ర స్థాయికి చేరాయి. భారత్​ భూభాగాల్లోకి చైనా సైన్యం చొచ్చుకొని వచ్చింది. అయితే భారత్​ ఒత్తిడితో చైనా తలొగ్గినప్పటికీ.. మరికొన్ని ప్రాంతాల్లో తన బలగాలను మోహరించే ఉంది.

జూన్ 15న జరిగిన ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో 35 మంది వరకు చైనా సైనికులు మరణించారని తెలుస్తుండగా.. ఈ విషయంపై డ్రాగన్ నోరు మెదపడం లేదు.

ఇదీ చదవండి- ఆ ప్రాంతాల నుంచి వెనక్కిమళ్లిన భారత్​-చైనా బలగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.