ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాటికి 71 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 4లక్షల 6 వేల మందికిపైగా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో 20 లక్షల కేసులు
అమెరికాలో తాజాగా 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితులు సంఖ్య 20 లక్షలు దాటింది. మరో 171 మంది మృతి చెందగా... ఫలితంగా లక్షా 12 వేల 640 మంది మృత్యువాతపడ్డారు.
రష్యాలో 9 వేల కేసులు
రష్యాలో కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 8,985 మంది వైరస్ సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 4,76,658కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో రష్యా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5,971 మంది మహమ్మారికి బలయ్యారు.
లక్ష దాటిన కేసులు..
పాకిస్థాన్లో గడిచిన 24 గంటల్లో మరో 4,728 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య లక్ష దాటింది. వీరిలో 67,249 మంది చికిత్స పొందుతుండగా... మరో 34,355 మంది కోలుకున్నారు.
ఒక్కరోజులో అత్యధిక మరణాలు..
బంగ్లాదేశ్లో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇవే అత్యధికం. మరో 2,735 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 68 వేల 504కు చేరింది.
నేపాల్లో 314 కేసులు..
నేపాల్లోనూ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 314 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,762కు ఎగబాకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 14కు చేరింది.
దక్షిణ కొరియాలో 38 కేసులు
దక్షిణ కొరియా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 12 వేలకు చేరువైంది. డోర్ టూ డోర్ డెలివరీ చేస్తున్న వారి నుంచి కేసులు నమోదవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు..
ఇదీ చూడండి:మహారాష్ట్రలో 90 వేలకు చేరువలో కరోనా కేసులు