ETV Bharat / international

స్కూల్స్ తెరవగానే పెరిగిన కరోనా కేసులు - కరోనా వైరస్​ మృతుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ ప్రభావం కొనసాగుతోంది. అనేక దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కానీ పెరుగుతున్న కేసులు వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. దక్షిణ కొరియాలో 50రోజుల్లో ఎన్నడూ లేని విధంగా 40 కొత్త కేసులు నమోదయయ్యాయి. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో వైరస్​కు ప్రజలు విలవిలలాడిపోతున్నారు.

Virus expands grip in many areas
ప్రపంచ దేశాలపై సడలని కరోనా పట్టు
author img

By

Published : May 27, 2020, 6:21 PM IST

ఓవైపు ప్రపంచ దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తుంటే.. మరోవైపు కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అనేక దేశాల్లో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5,710,753మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 3,52,869మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంకేసులుమృతులు
అమెరికా17,25,8081,00,625
బ్రెజిల్​394,50724,593
రష్యా3,70,6803,968
స్పెయిన్​2,83,33927,117
బ్రిటన్​2,65,22737,048
ఇటలీ 2,30,55532,955
ఫ్రాన్స్​​1,82,72228,530
జర్మనీ1,81,2888,498
టర్కీ1,58,7624,378

దక్షిణ కొరియాలో 50 రోజుల అనంతరం రికార్డు స్థాయిలో 40కేసులు వెలుగుచుశాయి. లక్షలాది మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం మొదలు పట్టిన తరుణంలో కేసులు పెరగడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

అమెరికాలో కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా అగ్రరాజ్యంలో మరణాల సంఖ్య లక్ష దాటింది.

ఆసియా, ఐరోపాలోని పలు దేశాల్లో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు ఇప్పుడిప్పుడే ఫలితాలనిస్తున్నాయి.

ప్రపంచదేశాలతో పోల్చితే న్యూజిల్యాండ్​లో పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. తమ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు సంఖ్య సున్నా అని న్యూజిల్యాండ్​ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.