అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో ఏకంగా 18వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,00,000 దాటింది. 345 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,475కు చేరింది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.
వారం రోజుల క్రితం అమెరికాలో వైరస్ బాధితుల సంఖ్య కేవలం 8వేలు. ప్రస్తుతం ఆ సంఖ్య 12 రెట్లకుపైగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఫ్రాన్స్‌లో 299 మంది మృతి..
ఫ్రాన్స్‌లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 299 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,995కు చేరింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 32,964కి పెరిగింది.
దక్షిణ ఆఫ్రికాలో
దక్షిణాఫ్రికాలో లాక్డౌన్ విధించిన అనంతరం రెండు మరణాలు సంభవించాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య 1000కి చేరింది. అయితే.. మొత్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,500లకు చేరుకోగా.. ఇప్పటి వరకు 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: ఇటలీలో 24 గంటల్లో సుమారు 1000 మంది మృతి