ETV Bharat / technology

OTT లవర్స్​కు గుడ్​న్యూస్- జియోహాట్‌స్టార్‌ వచ్చేసిందోచ్- సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ ఇవే! - JIOHOTSTAR STREAMING PLATFORM

హాట్‌స్టార్​లో జియో సినిమా విలీనం- ఇకపై అన్నీ ఒకే ప్లాట్​ఫారమ్​లో!

Jiostar launcheJioHotstar, a merger between JioCinena and Disney+ Hotstar
Jiostar launched JioHotstar, a merger between JioCinena and Disney+ Hotstar (Photo Credit- JioHotstar)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 14, 2025, 1:22 PM IST

JioHotstar Streaming Platform: రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ విలీనం తర్వాత ఇప్పుడు జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ రెండు ఓటీటీ ప్లాట్​ఫారమ్​లు కలిసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్​గా అవతరించి ఒకే వేదిక పైకి వచ్చాయి. జియోహాట్​స్టార్​ పేరుతో శుక్రవారం ఈ సంయుక్త సర్వీలు ప్రారంభించారు. ఈ మేరకు ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

"3 లక్షల గంటల ఎంటర్‌టైన్‌మెంట్‌, లైవ్‌ స్పోర్ట్స్‌ కవరేజీ, 50కోట్ల మందికి పైగా యూజర్లతో ఇకనుంచి 'జియోహాట్‌స్టార్‌' మరింత కొత్తగా ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఉన్న జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రైబర్లు సజావుగా ఈ కొత్త సర్వీసులను కొనసాగించుకోవచ్చు. జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవచ్చు" అని కంపెనీ తమ ప్రకటనలో రాసుకొచ్చింది.

జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనం అవుతాయన్న వార్తలు బయటకు వచ్చిప్పటి నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జియోహాట్‌స్టార్‌ పేరుతో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అవతరించబోతోందని వార్తలు రావడం, ఆ డొమైన్‌ తనదేనంటూ ఓ యాప్‌ డెవలపర్‌ ముందుకు రావడం, తన చదువుకయ్యే ఖర్చు మొత్తం రిలయన్సే భరించాలంటూ పేర్కొనడం అందరికీ తెలిసిందే.

ఓ దశలో తక్కువ మొత్తానికే రిలయన్స్‌కు ఇస్తానని పేర్కొని ఒక్కసారిగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత యూఏఈకి చెందిన ఇద్దరు చిన్నారులు తెరపైకి వచ్చి ఈ డొమైన్‌ను ఉచితంగా ఇస్తామని తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్‌ డొమైన్‌ వ్యవహారానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ 'జియో స్టార్‌' అనే కొత్త వెబ్‌సైట్‌ దర్శనమిచ్చింది.

తాజాగా ఈ వెంచర్‌ కిందే 'జియోహాట్‌స్టార్‌' ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అంటే ఇకపై జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లోని కంటెంట్‌ అంతా ఒకేచోట వీక్షించొచ్చు. ఈ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ రూ.149 నుంచే ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ వివరాలు మీకోసం.

జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ ఇవే!:

1. సింగిల్ డివైజ్ సపోర్టెడ్ ప్లాన్స్: జియోహాట్‌స్టార్‌ సింగిల్ డివైజ్ సపోర్ట్​తో రెండు ప్లాన్​లను తీసుకొచ్చింది.

  • రూ.149 సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్: మొబైల్‌ ప్లాన్‌ ప్రారంభ ధర రూ.149. ఈ ప్యాక్ 3 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారి జియోహాట్​స్టార్ వీక్షించే సమయంలో మధ్యలో యాడ్స్ కూడా వస్తాయి. అంటే ఇది యాడ్ సపోర్టెడ్ ప్లాన్ అన్నమాట. అంతేకాక ఈ ప్లాన్​ ద్వారా కేవలం ఒక మొబైల్​లో మాత్రమే కంటెంట్ చూసే సదుపాయం ఉంటుంది.
  • రూ.499 సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్: ఈ మొబైల్‌ ప్లాన్‌ ధరను రూ.499గా కంపెనీ నిర్ణయించింది. ఈ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. అయితే దీనితో కూడా కేవలం ఒక మొబైల్​లో మాత్రమే కంటెంట్ వీక్షించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇది కూడా యాడ్‌- సపోర్టెడ్‌ ప్లానే.

2. టూ డివైజెస్ సపోర్టెడ్ ప్లాన్స్:

  • రూ.299 సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్: కంపెనీ టూ-డివైజ్‌లకు సపోర్ట్‌ చేసేలా రెండు సూపర్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో మొదటి ప్లాన్​ ధర రూ.299. ఈ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్​ 3 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే వినియోగదారులు ఈ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​తో కంటెంట్ వీక్షిస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్​ వస్తాయి.
  • రూ.899 సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్: టూ డివైజెస్ సపోర్ట్​తో తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర​ రూ.899. ఇది ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ఇది​ కూడా యాడ్​- సపోర్టెడ్ ప్లానే.

3. యాడ్​ ఫ్రీ కంటెంట్ అండ్ ఫోర్ డివైజెస్ సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్: యాడ్​ ఫ్రీ కంటెంట్​ కోసం జియోహాట్‌స్టార్‌ 3 ప్రీమియం ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ నెలకు రూ.299తో ప్రారంభమవుతుంది. మూడు నెలల ప్రీమియం ప్లాన్‌ ధర రూ.499. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.1499. ఈ ప్రీమియం ప్లాన్లతో నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను వీక్షించొచ్చు.

Jiohotstar Streaming Platform Subscription Plans Details
Jiohotstar Streaming Platform Subscription Plans Details (Photo Credit- JioHotstar)

గమనిక: ఈ యాడ్ ఫ్రీ ప్లాన్స్​లో కూడా ప్రకటనలు వస్తాయని వినియోగదారులు గమనించాలి. అయితే అవి కేవలం స్పోర్ట్స్, ఇతర లైవ్ షోస్​ వీక్షించేటప్పుడు మాత్రమే కన్పిస్తాయి.

క్వాల్​కామ్​ నుంచి పవర్​ఫుల్ చిప్​సెట్ లాంఛ్- దీని స్పీడ్​ ఎంతో తెలిస్తే షాకే!

హాయ్ బేబీ అంటున్నారా?- ఆ పిలుపు ముంచే వలపు- హనీ ట్రాప్​లో చిక్కారో ఇక అంతే!

ఖరీదైన రీఛార్జ్​ ప్లాన్​లతో మీ జేబుకు చిల్లు పడుతోందా?- అయితే ఈ చౌకైనవి ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.