ETV Bharat / international

మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ - Novavax has begun the first phase of the trial

ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్​కు టీకా కనుగొనే ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు మనుషులపై వ్యాక్సిన్​ ప్రయోగాలు చేశాయి. తాజాగా అమెరికాకు చెందిన నోవావాక్స్​ అనే సంస్థ మానవులపై మొదటిదశ కొవిడ్​-19 వ్యాక్సిన్​ ట్రయల్స్​ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

US company trials coronavirus vaccine in Australia
మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​
author img

By

Published : May 26, 2020, 11:07 AM IST

Updated : May 26, 2020, 11:39 AM IST

మనుషులపై కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ ప్రారంభించినట్లు తెలిపింది అమెరికాకు చెందిన నోవావాక్స్​ అనే సంస్థ. ఆస్ట్రేలియాలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అలాగే ప్రాణాంతక కొవిడ్​-19కు ఈ ఏడాదిలోనే టీకా​ తయారు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు నోవావాక్స్​ రీసెర్చ్​ చీఫ్​ డాక్టర్​ గ్రెగొరీ గ్లెన్. మెల్​బోర్న్​, బ్రిస్బేన్​​లో వ్యాక్సిన్​ తొలిదశ ట్రయల్స్​లో భాగంగా 131 మందిపై ప్రయోగిస్తామని వెల్లడించారు. నానో పార్టికల్​ ఫ్లూ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసిన తరహాలోనే కరోనా టీకానూ తయారు చేస్తున్నామన్నారు గ్రెగొరీ.

"చైనా, అమెరికా, ఐరోపాలో దాదాపు డజను​కు పైగా కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ ప్రారంభ దశలో ఉన్నాయి. అయితే వీటిలో కొవిడ్​-19ను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్​ ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. అయితే వ్యాక్సిన్​ తయారీకి పలు రకాల పద్ధతులు, సాంకేతికతను వినియోగించడం వల్ల ఏదో ఒకటి విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది.

ఈ పరీక్షలన్నింటి ధ్యేయం ఒక్కటే.. శరీరంలో కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టే స్పైక్​ ప్రొటీన్​ను గుర్తించేలా రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇవ్వడం. ఇందుకోసం కొంత మంది వైద్య శాస్త్రవేత్తలు స్పైక్​ ప్రొటీన్​ జెనెటిక్​ కోడ్​ ఆధారంగా పరీక్షలు చేస్తున్నారు. మరికొందరు శరీరంలో ఈ ప్రొటీన్​ ఎలా ఉద్భవిస్తుంది అన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు హానికరం కాని ఒక వైరస్​ను వినియోగిస్తున్నారు. ఇంకొందరు ప్రాచీన పద్ధతులను అనుసరిస్తున్నారు.

అయితే జెనెటిక్​ ఇంజినీరింగ్​ సాయంతో నోవావాక్స్​.. స్పైక్​ ప్రొటీన్​ను ఉత్పత్తి చేసింది. ల్యాబ్​లో పెద్ద మొత్తం అభివృద్ధి చేసి.. వైరస్​ సైజులోనే ఉన్న నానోపార్టికల్స్​లో ఈ ప్రొటీన్లను ప్యాకేజ్​ చేసి మనుషులపై ప్రయోగిస్తున్నాం."

- డాక్టర్​ గ్రెగొరీ గ్లెన్, నోవావాక్స్​ రీసెర్చ్​ చీఫ్

ఇదీ చదవండి : రష్యాను వణికించిన భీకర తుపాను

Last Updated : May 26, 2020, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.