తాలిబన్ అగ్రనేతలకు పట్టంకడుతూ అఫ్గానిస్థాన్‌లో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వంపై (Taliban interim govt) ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలను గుర్తించేందుకు (recognition of taliban) చర్చలు జరపడం లేదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ (UN General Secretary) డిప్యూటీ ప్రతినిధి పేర్కొన్నారు. అది తమ బాధ్యత కాదని అన్నారు. చర్చల ద్వారా ఏర్పడిన సమ్మిళిత ప్రభుత్వం మాత్రమే దేశంలో శాంతి స్థాపనకు ఉపయోగపడుతుందని తెలిపారు.
"ఐరాస సెక్రెటేరియట్ గానీ, ఐరాస గానీ.. ప్రభుత్వాలకు గుర్తింపునిచ్చే అంశంపై చర్చలు జరపదు. ఇది సభ్యదేశాలు చేసే పని. మాది కాదు. అఫ్గాన్ పౌరుల హక్కులు, ముఖ్యంగా మహిళలు, యువతుల హక్కులను కాపాడేలా.. శాంతియుతమైన పరిష్కారానికి ఐరాస కట్టుబడి ఉంది. ప్రాణాలు కాపాడేందుకు, మానవతా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుంది."
-ఫర్హాన్ హక్, ఐరాస ప్రధాన కార్యదర్శి ఉప ప్రతినిధి
మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ తాలిబన్లు మంగళవారమే (Taliban Government) ప్రకటన విడుదల చేశారు. తాలిబన్ అగ్రనేతలకు ఇందులో చోటిచ్చారు. ఐరాస జాబితాలో ఉన్న సిరాజుద్దీన్ హక్కానీ (Sirajuddin Haqqani) వంటి ఉగ్రవాదులకూ స్థానం లభించింది.
'మమ్మల్ని అలా పిలవొద్దు'
మరోవైపు, తమను ఉగ్రవాదులు, అతివాదులు అని పిలవొద్దని తెహ్రీన్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) (tehrik I taliban TTP) జర్నలిస్టులను హెచ్చరించింది. టీటీపీ గురించి ప్రస్తావించేటప్పుడు ఉగ్రవాద సంస్థ అని పేర్కొనకూడదని చెప్పుకొచ్చింది. "మీడియా కవరేజ్‌ను మేం గమనిస్తున్నాం. టీటీపీని ఉగ్రవాదులు, అతివాదులుగా వర్ణిస్తున్నారు. ఇలాంటి పదాలు వాడుతూ.. మీడియా తమ పక్షపాత వైఖరిని చూపిస్తోంది. మీడియా వర్గాలు తమ వృత్తి పట్ల నిజాయతీగా ఉండటం లేదని తెలుస్తోంది. ఇలాంటి చర్యలు వల్ల వారికి శత్రువులు తయారవుతారు. కాబట్టి తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థానీ అని పిలవడం మంచిది" అని టీటీపీ ప్రతినిధి మహమ్మద్ ఖురసాని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు- లైవ్ ఇచ్చిన జర్నలిస్ట్‌కు తాలిబన్ల శిక్ష