ఇరాన్‌పై తీవ్రంగా మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధం కోరుకుంటే ఆ దేశం కథ ముగిసినట్టేనని ట్వీట్ చేశారు. ఎప్పుడూ అమెరికా జోలికి రావొద్దని హెచ్చరించారు.
ట్రంప్ ఆగ్రహంతో అమెరికా- ఇరాన్ దేశాల మధ్య బంధం మరింత బలహీనపడినట్టు స్పష్టమవుతోంది.
'ఇరాన్‌తో యుద్ధం జరగదు', 'త్వరలో ఇరాన్ చర్చలకు సిద్ధపడుతుంది...' అంటూ ప్రకటనలు చేసిన ట్రంప్... ఇరాన్‌ను ధ్వంసం చేస్తామని చేసిన తాజా వ్యాఖ్యలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి.
'భ్రమలో లేం...'
యుద్ధ వాతావరణంపై ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జవాద్ స్పందించారు.
"యుద్ధం చేయాలని ఇరాన్ కోరుకోవట్లేదు. ఈ ప్రాంతంలో ఇరాన్‌ను ఎదిరించి ఎవరైనా గెలుస్తారన్న భ్రమలో మేం లేము."
--- మహమ్మద్ జవాద్, ఇరాన్ విదేశాంగ మంత్రి.
ఇదీ చూడండి- 'నమో 2.0: ఎన్డీఏకే మళ్లీ అధికారం...!'