ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్... 'పర్సన్ ఆప్ ది ఇయర్ 2019'గా స్వీడన్ కు చెందిన వాతావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థెన్‌బెర్గ్ ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీపై ఉంచినట్లు ప్రకటించింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రఖ్యాత అమెరికా రచయిత రోమా డౌనీ ట్విట్టర్‌లో గ్రెటాను పొగిడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదే ట్వీట్‌ను ప్రస్తావిస్తూ గ్రెటాపై కౌంటర్ వేశారు.
"ఇది ఎంతో హాస్యాస్పదమైన విషయం. గ్రెటా ముందుగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వీలైతే ఫ్రెండ్‌తో పాటు ఓ సినిమాకి వెళ్లాలి! చిల్ గ్రెటా, చిల్!" - ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్
ట్రంప్ ట్వీట్‌కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చింది థెన్‌బెర్గ్. ట్రంప్ చెప్పినట్టే తన ట్విట్టర్ బయోను మార్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులపై ప్రపంచ దేశాల విధాన రూపకర్తలు నూతన విధానాలు రూపొందించాల్సిందిగా 'గ్లోబల్ యూత్ మూమెంట్' పేరుతో ఏడాది కాలంగా పోరాటం చేస్తోంది ఈ స్వీడన్ బాలిక.
- ఇదీ చూడండి: చైనాతో ఒప్పందానికి చేరువయ్యాం: ట్రంప్