ETV Bharat / international

అమెరికాకు భారత్ విలువైన భాగస్వామి: పాంపియో

author img

By

Published : Jul 16, 2020, 5:13 AM IST

అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో భారత్​తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు విలువైన భాగస్వామి అని పేర్కొన్నారు. భారత విదేశాంగమంత్రి జైశంకర్​తో తరచూ సంభాషించడంపై వివరణ ఇచ్చారు.

india
అమెరికాకు భారత్ విలువైన భాగస్వామి: పాంపియో

భారత్- అమెరికా సంబంధాలపై కీలక ప్రకటన చేశారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో. ఆయన భారత విదేశాంగమంత్రి జైశంకర్​తో తరచుగా మాట్లడడంపై వివరణ ఇచ్చారు. సరిహద్దు వివాదం సహా వివిధ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.

భారత విదేశాంగమంత్రి ఎస్​. శంకర్​తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు పాంపియో. చైనాతో సరిహద్దు వివాదం సహా ఆయా అంశాలు తమ మధ్య చర్చకు వస్తాయని చెప్పారు. చైనా టెలికమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాల ద్వారా ఎదురయ్యే ప్రమాదంపై ఇటీవల చర్చించామని పేర్కొన్నారు.

యాప్​ల తొలగింపు మంచిదే..

భారత్​లో చైనాకు చెందిన 59 యాప్​లపై నిషేధం విధించడం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు పాంపియో. చైనా నుంచి భారత్​లోని వ్యక్తుల ఫోన్లను నియంత్రించే యాప్​లపై నిషేధం విధించడం సరైందేనన్నారు. టిక్​టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్​లపై భారత్​ నిషేధం విధించింది.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలును దేశాలు అధిగమిస్తాయని తనకు నమ్మకం ఉన్నట్లు పేర్కొన్నారు పాంపియో.

ఇదీ చూడండి: 'ముందుంది మంచి కాలం- మళ్లీ నా గెలుపు తథ్యం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.