Varun Lavanya Wedding Invitation : టాలీవుడ్ సీనియర్ హీరో నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పీటలెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వరుణ్- లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలో ఈ ఇద్దరూ ఒక్కటవ్వనున్నారు. సన్నిహితుల సమక్షంలో జూన్ 9న ఈ జంటకు గ్రాండ్‌గా నిశ్చితార్ధం జరగ్గా.. ఇటలీలోని టస్కానీలో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అతి కొద్దమంది సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. తాజాగా ఈ జంట బ్యాచిలర్ పార్టీని కూడా చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాలు అటు వేడుకలతో పాటు ఇటు పెళ్లి పనుల్లోనూ బిజీగా ఉన్నాయి.
-
Fashion designer Manish Malhotra flies down to meet the megacouple #varunlav spotted visiting the store for final fitting for big day #varuntej#lavanyatripathi#wedding#operationvalentine pic.twitter.com/NX8MUdNMRb
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fashion designer Manish Malhotra flies down to meet the megacouple #varunlav spotted visiting the store for final fitting for big day #varuntej#lavanyatripathi#wedding#operationvalentine pic.twitter.com/NX8MUdNMRb
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 25, 2023Fashion designer Manish Malhotra flies down to meet the megacouple #varunlav spotted visiting the store for final fitting for big day #varuntej#lavanyatripathi#wedding#operationvalentine pic.twitter.com/NX8MUdNMRb
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 25, 2023
ఇక ఈ జంట నవంబర్ 1న వివాహ బంధంలోకి అడుగపెట్టనుండగా.. తాజాగా వీరి పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిల్వర్ కలర్‌లో ఉన్న ఆ కార్డు చూడటానికి ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది. అందులో మొదట వరుణ్ తాత, నాన్నమ్మల పేర్లను పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. ఈ పేర్లతో పాటు వరుణ్ తల్లిదండ్రుల పేర్లు నాగబాబు, పద్మజ, లావణ్య తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాఠి పేర్లు కూడా పెళ్లి కార్డులో ఉన్నాయి. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డులో తమ స్టార్స్ పేర్లు చూసి తెగ సంబరపడుతున్నారు.
-
Wedding Invitation of #VarunTej & #LavanyaTripathi👌👌 pic.twitter.com/9a2BEj3U4I
— Siddhu Tweets (@ProSiddhu_) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wedding Invitation of #VarunTej & #LavanyaTripathi👌👌 pic.twitter.com/9a2BEj3U4I
— Siddhu Tweets (@ProSiddhu_) October 26, 2023Wedding Invitation of #VarunTej & #LavanyaTripathi👌👌 pic.twitter.com/9a2BEj3U4I
— Siddhu Tweets (@ProSiddhu_) October 26, 2023
Varuntej Lavanya Tripathi Pre Wedding Photos : మెగా హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. రీసెంట్గా చిరంజీవి నివాసంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా... తాజాగా అల్లు వారి ఇంట్లో మరో గ్రాండ్ పార్టీ జరిగింది. కాబోయే వధూవరులకు అభినందనలు తెలుపుతూ.. హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబసభ్యులతో పాటు హీరో నితిన్, ఆయన సతీమణి షాలినీ, నటి రీతూవర్మ, పలువురు సన్నిహితులు ఈ పార్టీకి హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "త్వరలో జరగనున్న వరుణ్ - లావణ్య పెళ్లి సందర్భంగా మా ఇంట్లో ఓ పార్టీ జరిగింది" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్‌గా మారాయి. కాగా, 'మిస్టర్' సినిమా సమయంలో ఫ్రెండ్స్ అయిన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఆ తర్వాత 'అంతరిక్షం' షూటింగ్లో ప్రేమలో పడ్డారు.
Varun Tej - Lavanya : అల్లు అర్జున్ ఇంట్లో.. వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ పార్టీ