ETV Bharat / entertainment

మెగా ఇంట్లో పెళ్లి బాజాలు​.. జూన్​ 9న వరుణ్ తేజ్​- లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం - పారిస్​లో లావణ్య త్రిపాఠి

Varun Tej lavanya tripati in Paris : మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లిపీటలెక్కపోతున్నారని సమాచారం. ఈ మేరకు జూన్​ 9న నిశ్చితార్థం వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు..

Varun Tej lavanya Engagement
Varun Tej lavanya Engagement
author img

By

Published : Jun 1, 2023, 1:15 PM IST

Updated : Jun 1, 2023, 2:05 PM IST

Varun Tej and Lavanya Tripathi Vacation : టాలీవుడ్​ లవ్​ బర్డ్స్​ వరుణ్​ తేజ్​ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో​ జూన్​ 9న జరగనుంది. ఈ క్రమంలో ఈ జంట.. తమ ఎంగేజ్మెంట్​కు ముందు వెకేషన్​కు వెళ్లిందని.. పారిస్​​ అందాలను ఆస్వాదిస్తూ ఈ జంట వెకేషన్​ను ఎంజాయ్​ చేస్తోందని ప్రచారం సాగుతోంది.

వారం క్రితం లావణ్య త్రిపాఠి ట్రావెల్ మోడ్​ అంటూ ఎయిర్​పోర్ట్​లో తీసుకున్న తన లేటెస్ట్ సెల్ఫీని అప్​లోడ్​ చేశారు. అయితే ఈమె ఎక్కడికి వెళ్తోందన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మరో వైపు వరుణ్​ తేజ్​ కూడా హాలీడేలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం పారిస్​లో​ వెకేషన్​ను ఎంజాయ్​ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేశారు. దీంతో వీరిద్దరూ ఒకే చోట ఉన్నారంటూ ఫ్యాన్స్​ అనుకుంటున్నారు. సోషల్​ మీడియాలో వారి పోస్ట్​ల కింద విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో లావణ్య పోస్ట్​ కింద.. 'వెల్​కమ్​ టు మెగా ఫ్యామిలీ', 'వరుణ్​ తేజ్​తో ఎప్పుడు మీ మ్యారేజ్'​ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు వీరిద్దరూ శుక్రవారం హైదరాబాద్​కు తిరిగి రానున్నారని ఆ తర్వాత తమ ఎంగేజ్మెంట్​ కోసం సన్నాహాలు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది​.

Varun Tej and Lavanya Tripathi Relationship : ఈ ఏడాది జనవరిలో లావణ్య త్రిపాఠి బర్త్​డే పార్టీ.. బెంగళూరులో గ్రాండ్​గా జరిగింది. దానికి హాజరైన వరుణ్​.. లావణ్యకు ఓ కాస్ట్లీ డైమండ్​ రింగ్​తో ​ప్రపోజ్​ చేశారని.. ఆ ప్రపోజల్​కు లావణ్య కూడా ఓకే చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సరిగ్గా ఓ నెల తర్వాత ఈ రూమర్స్​పై స్పందించిన వరుణ్​ తేజ్ తండ్రి నాగబాబు.. ఈ ఏడాదిలోనే వరుణ్​ పెళ్లిచేసుకోబోతున్నారని.. వధువు వివరాలు త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. దీంతో లావణ్య-వరుణ్​ రిలేషన్​షిప్ రూమర్స్​కు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వార్తలపై అటు వరుణ్​ తేజ్​ గాని, ఇటు లావణ్య త్రిపాఠి గాని ఎక్కడ కూడా స్పందించలేదు.

Varun Tej and Lavanya Tripathi Movies : 'అంతరిక్షం', 'మిస్టర్‌' లాంటి సినిమాల్లో వరుణ్‌ తేజ్​తో స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు లావణ్య త్రిపాఠి. అయితే ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా వరుణ్‌ సోదరి నటి నిహారిక వివాహానికి సైతం లావణ్య హాజరైంది. దీంతో ఆ వార్తలకు మరింత బలం వచ్చింది.

Last Updated : Jun 1, 2023, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.