ETV Bharat / entertainment

పవన్-పూరీల బద్రి చిత్రానికి 21 ఏళ్లు

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బద్రి. ఈ సినిమాకు నేటితో 21 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు చూద్దాం.

badri
బద్రి
author img

By

Published : Apr 20, 2021, 3:51 PM IST

Updated : Oct 25, 2022, 10:42 AM IST

"నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌".. 'బద్రి' అనగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే డైలాగ్‌ ఇది. అంతగా పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌ రాజ్‌ ఆకట్టుకున్నారు ఈ సినిమాతో. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు. 2000 ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు 'బద్రి'. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విశేషాలు చూద్దాం..

విజయ లక్ష్మీ మూవీస్‌ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌ తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. నాయిక రేణు దేశాయ్‌ ఈ సినిమాతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అమీషా పటేల్‌ మరో నాయిక. రొమాంటిక్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో పవన్‌ స్టైల్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. రమణ గోగుల సంగీతం ఉర్రూతలూగించింది. ముఖ్యంగా 'ఐ యామ్‌ ఇండియన్‌', 'ఏ చికితా', 'బంగాళాఖాతంలో నీరంటే' పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించాయి. ఇప్పటికీ ఏదో సందర్భంలో ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. పూరి జగన్నాథ్‌ మాటలు, పవన్‌ మ్యానరిజం, రమణ గోగుల పాటలు.. ఇలా అన్నీ అద్భుతంగా నిలిచి బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకున్నాయి.

అలా తెరకెక్కింది..

"పవన్‌ కల్యాణ్‌కి కథ చెప్పినపుడు బాగుంది అన్నారు. కానీ, క్లైమాక్స్‌ విషయంలో సందేహించారు. నాకు క్లైమాక్స్‌ నచ్చలేదు.. దాన్ని మార్చి తీసుకొస్తే నువ్వే దర్శకుడు అన్నారు. అంతే కదా అనుకుని రెండు మూడు వెర్షన్లు రాశాను. తొలిసారి రాసిన దాంట్లో ఫైట్లు ఉండవు. అందుకే ఆయనకు నచ్చలేదేమో అనుకుని, తర్వాత వాటిల్లో యాక్షన్‌ సన్నివేశాలు రాశాను. అది నాకే నచ్చలేదు. దాంతో పాత స్ర్కిప్టుతోనే ఆయన దగ్గరకు మళ్లీ వెళ్లా. ఏంటి పరిస్థితి అని పవన్‌ అడిగితే.. రాశాను అని ఇంతకు ముందు చెప్పిందే క్లుప్తంగా మరోసారి వివరించాను. నాకు ఫస్ట్‌ చెప్పింది ఇదే కదా! అని పవన్‌ అడగ్గానే అప్పుడు మీరు సరిగా విన్నారో లేదో అని చెప్తున్నా అన్నాను. నాకూ ఇదే నచ్చింది. నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను అని చెప్పారు పవన్‌. అలా ఈ సినిమా వచ్చింది. నేను క్లైమాక్స్‌ మార్చుంటే మరోలా ఉండేది. నా క్యారెక్టర్‌ పోయేది" అంటూ ఓ సందర్భంలో తెలియజేశారు పూరి జగన్నాథ్‌.

Last Updated : Oct 25, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.