ETV Bharat / entertainment

'బింబిసార' ఎన్టీఆర్​ రివ్యూ.. సినిమా అదిరిపోయిందన్న యంగ్​ టైగర్​!

NTR Bimbisara movie: అన్న కళ్యాణ్​రామ్ నటించిన 'బింబిసార' స్పెషల్​ ప్రివ్యూను యంగ్ టైగర్​ ఎన్టీఆర్ వీక్షించారని తెలిసింది. సినిమా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్​పై ప్రశంసలు కురిపించారట. మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారని తెలిసింది

NTR praises on Kalyan ram Bimbisara movie
'బింబిసార' ఎన్టీఆర్​ రివ్యూ
author img

By

Published : Jul 20, 2022, 7:01 PM IST

NTR Bimbisara movie: నందమూరి హీరో కళ్యాణ్​రామ్​ నటించిన తొలి ఫాంటసీ అండ్​ అడ్వెంచర్​ చిత్రం 'బింబిసార'. భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ మూవీని ఎన్టీఆర్​ ఆర్ట్స్​ బ్యానర్​పై హరికృష్ణ.కె నిర్మించారు. కేథరిన్​, సంయుక్తా మేనన్​ హీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీపై మరింత హైప్​ క్రియేట్​ చేసేందుకు మేకర్స్​ ప్రమోషన్స్​ను ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగానే ఓ క్రేజీ న్యూస్​ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ ప్రివ్యూను యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ చూశారని తెలిసింది. సినిమా బాగా నచ్చడం మూవీటీమ్​పై ప్రశంసలు కురిపించారట. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, కళ్యాణ్​ రామ్​ సక్సెస్​ అవ్వడం ఖాయమని చెప్పారట. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్​, ట్రైలర్​ అభిమానులను ఆకట్టుకుంది.

కాగా, వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను వర్తమానానికి చరిత్రకు ముడిపెడుతూ ఓ విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రంగా 'బింబిసార'ను రూపొందించారు. ఇందులో కల్యాణ్‌ రామ్‌ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్​లో త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ చేసిన యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌ ప్రేక్షకుల్ని చరిత్రలోకి తీసుకెళ్లేలా చేస్తోంది. ఇక ఈ మూవీకి చిరంతన్‌ భట్‌-సంగీతం, ఎం.ఎం.కీరవాణి-నేపథ్య సంగీతం, తమ్మిరాజు-కూర్పు, ఛోటా కె.నాయుడు - ఛాయాగ్రహణం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Oo Antava song: మరోసారి రెచ్చిపోయిన సామ్​.. ఆ స్టార్​ హీరోతో చిందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.