ETV Bharat / entertainment

ధనుశ్​కు గట్టి పోటీ ఇవ్వనున్న కల్యాణ్​రామ్​.. 'NKR19' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! - నందమూరి కల్యాణ్​రామ్​ ఎన్​కేఆర్​ 19

'బింబిసార' సినిమా ఇచ్చిన జోష్​తో హీరో కల్యాణ్​రామ్​ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'NKR 19' సినిమా రిలీజ్​ డేట్ ఫిక్స్​ అయినట్లు తెలిసింది. ఆ వివరాలు..

nandamuri kalyanram movie
nandamuri kalyanram movie
author img

By

Published : Oct 30, 2022, 9:14 PM IST

Nandamuri Kalyan Ram NKR 19 : చాలా కాలం త‌ర్వాత 'బింబిసార‌'తో గ్రాండ్ కమ్​బ్యాక్ ఇచ్చారు కల్యాణ్​రామ్. 'ప‌టాస్' త‌ర్వాత దాదాపు 8 ఏళ్లకు కల్యాణ్​రామ్‌ ఈ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించారు. భారీ అంచ‌నాల నడుమ‌ ఆగ‌స్టు 5న రిలీజైన ఈ చిత్రం మొద‌టి షో నుంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకొని భారీ వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడు అదే జోష్‌లో కల్యాణ్​రామ్‌ తన తదుపరి సినిమాలను పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో అమిగోస్‌ ఒకటి. NKR 19గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రిలీజైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 2న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందట. కాగా అదే రోజున ధనుశ్​ 'సార్‌' సినిమా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించడం వల్ల తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్‌ అవ్వనుంది.

ఇవీ చదవండి: నెట్టింట వైరల్​గా మారిన బన్నీ ఫొటో.. 'పుష్ప-2' షూటింగ్​ స్టార్ట్​ అయిందా?

ఆఫ్రికాలో రామ్​చరణ్​ వెకేషన్.. వంట చేస్తూ ఎంజాయ్​.. వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.