ETV Bharat / entertainment

నెరిసిన జుట్టుతో.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో స్టార్​ హీరోలు

కుదిరితే క్లాస్‌.. లేదంటే మాస్‌.. ఇవన్నీ కాదంటే ఫుల్‌ స్టైలిష్‌.. తెరపై హీరోలెప్పుడూ ఈ మూడు గెటప్పుల్లోనే కనువిందు చేస్తుంటారు. ఇవన్నీ దాటి  ఓ కొత్త లుక్కు ప్రయత్నించారంటే అదొక సాహసం. సినీప్రియులు ఎలా స్వీకరిస్తారోనన్న అనుమానాలు.. ఇమేజ్‌ దెబ్బతింటుందేమోనన్న భయాలు వెంటాడేవి. అందుకే ఐదు పదుల వయసు దాటిన కథానాయకుడైనా.. తెరపై పాతికేళ్ల కుర్రాడిలా కనిపించేందుకే ఇష్టపడేవారు. కథానాయిక వెంటపడుతూ నవ మన్మథుడిలా పోజులు కొట్టేవారు. ఇక వయసు పైబడిన పాత్రలంటే ఆమడ దూరం జరిగిపోయేవారు. అయితే ఈ మధ్య సీన్‌ మారింది. ప్రేక్షకులకు కొత్తదనం అందించేందుకు నయా గెటప్పులు  ప్రయత్నిస్తున్నారు. అవసరమనుకుంటే నెరిసిన జుట్టుతోనే.. స్టైలిష్‌గా  మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు.

Heroes looking stylish with gray hair
నెరిసిన జుట్టుతో.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో స్టార్​ హీరోలు
author img

By

Published : Jul 18, 2022, 6:48 AM IST

ఒకప్పటితో పోల్చితే ప్రేక్షకుల అభిరుచుల్లో ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి. కొత్తదనం నిండిన కథల్ని ఇష్టపడుతున్నారు. అభిమాన తారల్ని కొత్త రకమైన వేషధారణలో చూసుకోవాలని ఆశపడుతున్నారు. అందుకే కొన్నాళ్ల క్రితం వరకు 'ప్రయోగాలు అవసరమా?' అని భావించిన హీరోలు సైతం లుక్కులోనూ.. గెటప్పులోనూ వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ క్రమంలోనే పలువురు అగ్ర కథానాయకులు సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌తో మురిపించేందుకు సిద్ధమయ్యారు.

చిరు.. సరికొత్తగా..
మునుపెన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు చిరంజీవి. చేసే ప్రతి చిత్రంలోనూ కొత్త లుక్కుతో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో 'గాడ్‌ఫాదర్‌' ఒకటి. మలయాళంలో విజయవంతమైన 'లూసీఫర్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఇటీవలే బయటకొచ్చింది. అందులో చిరు నెరిసిన జుట్టుతో స్టైలిష్‌గా కనిపించి మురిపించారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. దసరా పండక్కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

.
.

బాలయ్య ధమాకా..
కథ నచ్చిందంటే చాలు.. చేసే పాత్ర కోసం ఎలాంటి లుక్కులోకి మారడానికైనా వెనకాడరు కథానాయకుడు బాలకృష్ణ. ఇటీవల 'అఖండ' సినిమాలో అఘోరాగా సరికొత్త అవతారంలో మెప్పించారు. ఇప్పుడు గోపీచంద్‌ మలినేని సినిమా కోసం మరో కొత్త లుక్కు ప్రయత్నించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఓ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాలు బయటకొచ్చాయి. అందులో బాలకృష్ణ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌తో ఫుల్‌ మాస్‌గా కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. దీని తర్వాత బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. అందులో బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా.. సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలిసింది.

.
.

వయసు పెంచేసిన కార్తి..
కథల ఎంపికలోనే కాదు.. కనిపించే లుక్కు విషయంలోనూ వైవిధ్యం కనబరుస్తుంటారు కథానాయకుడు కార్తి. ప్రస్తుతం ఆయన పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో 'సర్దార్‌' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్న తొలి చిత్రమిది. ఇందులో ఆయన ఓ పాత్రలో వృద్ధుడిగా.. మరో పాత్రలో మధ్య వయసులో ఉన్న పోలీస్‌గా విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా అక్టోబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

.
.

ఓటీటీ కోసం.. వెంకీ
కథానాయకుడు వెంకటేష్‌ 'రానా నాయుడు' వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అమెరికన్‌ టీవీ సిరీస్‌ 'రే డొనోవన్‌'కు రీమేక్‌గా రూపొందింది. ఈ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ కోసం ఓ కొత్త గెటప్‌ ప్రయత్నించారు వెంకీ. పూర్తిగా నెరిసిన జుట్టుతో ఫుల్‌ స్టైలిష్‌ అవతారంలోకి మారారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇందులో సుర్వీన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్‌, ఆశిష్‌ విద్యార్థి కీలక పాత్రలు పోషించారు.

.
.

ఇదీ చదవండి: ఎక్స్​ బాయ్​ఫ్రెండ్​తో ఫిజికల్​ రిలేషన్​.. జాన్వీ రిప్లై ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.