Game Changer Sailesh Kolanu : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. అయితే మూవీ టీమ్ మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. గతంలో దీపావళి కానుకగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందని మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే అది కూడా వాయిదా పడటం వల్ల ఇప్పుడు చెర్రీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకువచ్చింది. 'గేమ్ ఛేంజర్' సినిమాలోని కొన్ని సీన్స్‌ను 'సైంధవ్' సినిమా డైరెక్టర్ శైలేశ్ కొలను డైరెక్ట్ చేశానంటూ తనే స్వయంగా చెప్పారు. దీంతో పాటు గేమ్ ఛేంజర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్స్ మీరు డైరెక్ట్ చేసారంటూ టాక్ వచ్చింది. ఈ సినిమా ఎలా నడుస్తుందో ఓ సారి చెప్పగలరా"అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు శైలేశ్ ఆన్సర్ ఇచ్చారు.
" ఏ సినిమాలో అయినా అందులో స్టార్స్ లేని సీన్స్, కొన్ని డ్రోన్ షాట్స్, వైడ్ యాంగిల్స్, లొకేషన్ షాట్స్ లాంటివి డైరెక్టర్ టైమ్ కలిసొస్తుందంటూ తన అసిస్టెంట్స్‌కి చెప్పి షూట్ తీసుకురమ్మంటాడు. అయితే శంకర్ ఇలాంటివి కూడా ఆయనే తీసుకుంటారు. కానీ 'గేమ్ ఛేంజర్' విషయంలో మాత్రం ఓ లొకేషన్ ముందుగానే బుక్ చేశారు. అయితే ఆ సమయానికి శంకర్ సర్ అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో లొకేషన్ వేస్ట్ అయిపోతుందని దిల్ రాజుకి ఈ షాట్స్ ఎవరన్నా మంచి డైరెక్టర్‌తో తీయించండి అంటూ శంకర్ కోరారట. అలా నేను ఓకే చెప్పాను. రెండు రోజులు ఓ లొకేషన్లో షూట్ చేసాం. అవేమి సీన్స్ కాదు, జస్ట్ ఎష్టాబ్లిష్మెంట్ షాట్స్ మాత్రమే. నేను ఆ అవుట్‌పుట్‌ను దిల్ రాజుకు ఇచ్చాను అంతే. అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
-
#GameChanger pic.twitter.com/mmtxSsevqD
— Gautam Talkies (@GautamTalkies) January 9, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#GameChanger pic.twitter.com/mmtxSsevqD
— Gautam Talkies (@GautamTalkies) January 9, 2024#GameChanger pic.twitter.com/mmtxSsevqD
— Gautam Talkies (@GautamTalkies) January 9, 2024
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. ఈ కాంబోలు అసలు ఊహించనివి!
'ఇక రీమేక్‌లు చేయను.. హిందీ ప్రేక్షకులు నన్ను గట్టిగా తిట్టుకుంటున్నారు!'