Dunki Opening Day Collection : 'పఠాన్', 'జవాన్' సినిమాలతో వరుస హిట్లు అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా 'డంకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'త్రీ ఇడియట్స్' ఫేమ్ రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ అందుకుని థియేటర్లలో నడుస్తోంది. అయితే భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఈ చిత్రం మొదటి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేకపోయింది.
-
#Dunki : ⭐⭐ ½
— Manobala Vijayabalan (@ManobalaV) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
BUNK(I)#DunkiReview pic.twitter.com/EvU3w1r7bG
">#Dunki : ⭐⭐ ½
— Manobala Vijayabalan (@ManobalaV) December 21, 2023
BUNK(I)#DunkiReview pic.twitter.com/EvU3w1r7bG#Dunki : ⭐⭐ ½
— Manobala Vijayabalan (@ManobalaV) December 21, 2023
BUNK(I)#DunkiReview pic.twitter.com/EvU3w1r7bG
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'డంకీ' సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసులు చేసిందట. నెట్ కలెక్షన్స్ ప్రకారం ఇది రూ.30 కోట్లు క్రాస్ చేసిందని సమాచారం. దీంతో ఈ ఏడాది విడుదలైన 'గదర్ 2', 'పఠాన్' 'జవాన్', 'యానిమల్' ఓపెనింగ్స్ కంటే తక్కువగా సాధించిందట. పఠాన్ తొలి రోజు రూ.57 కోట్లు వసూలు చేసింది. ఇక జవాన్ రూ.74.50 కోట్లు, యానిమల్, రూ. 63 కోట్లు, గదర్ 2 రూ.40.1 కోట్లు కలెక్ట్ చేసింది.
మరోవైపు 'ఆదిపురుష్' సినిమా కంటే 'డంకీ' తక్కువ కలెక్షన్స్ అందుకుని సినీ వర్గాల టాక్. నెట్ కలెక్షన్స్ ప్రకారం 'ఆదిపురుష్' తొలి రోజు రూ.37 కోట్లు సాధించిందట. దీంతో బాలీవుడ్‌లో టాప్ కలెక్షన్స్ లిస్ట్‌లో 'డంకీ' 7వ స్థానంలో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Dunki OTT Rights : మరోవైపు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాస్ రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే సినిమా విడుదలైన దాదాపు 25 రోజుల్లోనే ఇది ఓటీటీలో సందడి చేయనుందట. అయితే ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు.
'డంకీ'లో షారుక్ అందుకోసమే నటించారట - ఈ సినిమా గురించి ఈ విశేషాలు తెలుసా?
యూకే వెళ్లేందుకు తిప్పలు - 25 ఏళ్ల తర్వాత రివెంజ్ - ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న 'డంకీ' ట్రైలర్