ETV Bharat / entertainment

బాలీవుడ్​ మూవీకి దేవిశ్రీ మ్యూజిక్​​.. అఖిల్​ 'ఏజెంట్​' రిలీజ్​ వాయిదా? - SaiPallavi Dance Video viral

గ‌తంలో బాలీవుడ్​లో స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన రెడీ, జ‌య‌హో, రాధే సినిమాల్లో ఒక్కో పాట‌కు సంగీతాన్ని అందించారు దేవి శ్రీ ప్ర‌సాద్‌. తాజాగా ఆయ‌న పూర్తిస్థాయి మ్యూజిక్‌ డైరెక్ట‌ర్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. మరోవైపు, అక్కినేని అఖిల్​ హీరోగా తెరకెక్కుతున్న 'ఏజెంట్'.. విడుదల వాయిదా వేయాలని మేకర్స్​ భావిస్తున్నారట.

Devisriprasad Bollywood
Devisriprasad Bollywood
author img

By

Published : Jun 17, 2022, 2:17 PM IST

Devisriprasad Bollywood Movie: 'పుష్ప' సినిమాతో బాలీవుడ్‌లో దేవి శ్రీ ప్ర‌సాద్ పేరు మారుమోగింది. ఈ సినిమా కోసం అత‌డు స్వ‌ర‌ప‌ర‌చిన‌ పాట‌ల‌న్నీ హిందీ శ్రోత‌ల‌ను విపరీతంగా అల‌రించాయి. ఆ త‌ర్వాత దేవిశ్రీకి బాలీవుడ్‌లో వ‌రుసగా అఫ‌ర్లు తలుపు తడుతున్నాయి. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్న 'క‌భీ ఈద్ క‌భీ దివాళీ'లో రెండు పాట‌ల‌కు సంగీతాన్ని స‌మ‌కూర్చ‌బోతున్నారు.

తాజాగా అత‌డు బాలీవుడ్​లో మరో భారీ బ‌డ్జెట్ సినిమాకు మ్యూజిక్​ను అందించ‌బోతున్న‌ారు. వ‌రుణ్‌ ధావ‌న్‌, జాన్వీక‌పూర్ జంట‌గా 'బ‌వాల్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో పూర్తిస్థాయి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దేవిశ్రీ ప్ర‌సాద్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. గ‌తంలో స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన రెడీ, జ‌య‌హో, రాధే సినిమాల్లో ఒక్కో పాట‌కు సంగీతాన్ని అందించారు దేవిశ్రీ. కానీ ఓ బాలీవుడ్ సినిమాకు అన్ని పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతాన్ని స‌మ‌కూర్చ‌డం దేవిశ్రీప్రసాద్​కు ఇదే తొలిసారి.

Agent Movie Postponed: అక్కినేని న‌ట‌ వార‌సుడు అఖిల్ క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' కాస్త ఊర‌ట‌నిచ్చింది. ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్​ కొట్టాల‌ని సురేంద‌ర్ రెడ్డితో చేతులు క‌లిపారు. ప్ర‌స్తుతం వీళ్ల కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం 'ఏజెంట్‌'. హీరో అఖిల్.. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయిన‌ట్లు గ‌తంలో విడుద‌లైన పోస్ట‌ర్‌ల‌ను చూస్తే తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆగ‌స్టు 12న విడుద‌ల కానున్న‌ట్లు మేకర్స్ గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీ విడుదల వాయిదా ప‌డ‌నుంద‌ట‌.

అక్కినేని అఖిల్​
అక్కినేని అఖిల్​

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వ‌చ్చిందట. యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్ర‌ధానంగా ఉండ‌టం వల్ల చాలా స‌మయం ప‌డుతుందట‌. అందుకే చిత్ర బృందం విడుద‌ల‌ తేదీని వాయిదా వేయాల‌ని భావిస్తుంద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుందట. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్​టైన్​ మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు. అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

SaiPallavi Dance Video: ప్రముఖ నటి సాయి పల్లవి డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. లైక్స్‌, కామెంట్లతో దూసుకెళ్తోంది. తమ కొత్త చిత్రం 'విరాటపర్వం' ప్రచారానికి సాయి పల్లవి, రానా, దర్శకుడు వేణు ఊడుగుల.. ఓ కాలేజ్‌కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో వారంతా సినిమా విశేషాలు పంచుకున్నారు. అనంతరం, సాయి పల్లవి తనకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన 'ఫిదా' సినిమాలోని 'వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే' పాటకు డ్యాన్స్‌ చేసి అలరించారు. విద్యార్థులంతా కేరింతలతో ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణలో 90ల్లోని నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే 'విరాటపర్వం'. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

ఇవీ చదవండి: రజనీకాంత్​ కొత్త సినిమా టైటిల్​ ఫిక్స్​.. యశ్​తో పూజా రొమాన్స్​!

కొత్త సినీ ప్రపంచం.. భారతీయ వెండితెరపై మల్టీ యూనివర్స్‌ మూవీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.