ETV Bharat / entertainment

రూ.200కోట్ల కేసు.. జాక్వెలిన్​కు మధ్యంతర బెయిల్ పొడిగింపు - జాక్వెలిన్​ రూ 200 కోట్లు కేసు

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్​ బెయిల్​ పిటీషన్​ను మళ్లీ విచారణ జరిపింది దిల్లీ కోర్టు. ఆమె మధ్యంతర బెయిల్​ గడువు తేదీని పొడిగించింది.

jacquelin
రూ.200కోట్ల కేసు.. జాక్వెలిన్​కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
author img

By

Published : Oct 22, 2022, 5:00 PM IST

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు దిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆ బెయిల్​ గడువు తేదీని నంవబర్​ 10 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా, ఈ మనీలాండరింగ్​ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 26న కోర్టు ఎదుట హాజరుకావాలంటూ నటికి సమన్లు జారీ చేసింది. దీంతో జాక్వెలిన్‌ పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరై.. మధ్యంతర బెయిల్‌ కోసం దరఖాస్తు చేసింది.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఈడీ నుంచి స్పందన కోరింది. రెగ్యులర్‌ బెయిల్‌ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అప్పటివరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని జాక్వెలిన్‌ న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం రూ.50వేల పూచికత్తుపై జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ తాజాగా విచారించిన కోర్టు జాక్వెలిన్​కు మధ్యంతర బెయిల్​ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ కేసు.. దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంది. ఇటీవల దిల్లీ పోలీసులు కూడా ఈ కేసులో నటిని విచారించారు. సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి ఆమె అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆమెను ఆరా తీశారు.

ఆ తర్వాత, జాక్వెలిన్‌ స్టైలిస్ట్‌ లేపాక్షి ఎల్లవాడిని కూడా దిల్లీ పోలీసులు, ఆర్థిక నేరాల విభాగం అధికారులు ప్రశ్నించారు. సుకేశ్‌తో జాక్వెలిన్‌ సన్నిహిత సంబంధం గురించి తనకు తెలుసునని లేపాక్షి విచారణలో చెప్పినట్లు తెలిసింది. అయితే సుకేశ్‌ అరెస్టు వార్త తెలిసిన తర్వాత జాక్వెలిన్‌ అతడితో సంబంధాలు తెంచుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం.

ఇదీ చూడండి: దర్శకురాలిపై చీటింగ్ కేసు.. యువ నటుడిని అశ్లీల చిత్రంలో నటించమని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.