ETV Bharat / entertainment

బిగ్​బాస్ విన్నర్​గా 'పల్లవి ప్రశాంత్'- ప్రైజ్​మనీ మొత్తం రైతులకే! - బిగ్​బాస్ సీజన్7 తెలుగు పల్లవి ప్రశాంత్

Bigg Boss 7 Telugu Winner : బిగ్​బాస్ సీజన్ 7లో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్నాడు. టాప్-5 కంటెస్టెంట్స్​ ఓటింగ్​లో అందరి కంటే అత్యధిక ఓట్లు సాధించిన ప్రశాంత్ బిగ్​బాస్ విజేతగా అవతరించాడు.

bigg boss 7 telugu winner
bigg boss 7 telugu winner
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 10:43 PM IST

Updated : Dec 18, 2023, 6:55 AM IST

Bigg Boss 7 Telugu Winner : బిగ్​బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్​గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. 105 రోజులపాటు సాగిన రియాలిటీ షోలో అత్యధిక మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రశాంత్, బిగ్​బాస్ టైటిల్ నెగ్గిన తొలి కామన్ మ్యాన్​గా రికార్డుకొట్టాడు. నటుడు అమర్​దీప్​ రన్నరప్​గా నిలిచాడు. కాగా, హోస్ట్​ నాగార్జున అక్కినేని ప్రశాంత్​ను విన్నర్​గా అఫీషియల్​గా ప్రకటించారు. ఈ ఫినాలేకి మాస్ మహారాజా రవితేజ స్పెషల్ గెస్ట్​గా హాజరయ్యారు.

ఇక గ్రాండ్ ఫినాలో సీనియర్ నటుడు శివాజీ, పల్లవి ప్రశాంత్‌, ప్రియాంక, యావర్‌, అర్జున్‌, అమర్‌ దీప్‌ టాప్-6లో నిలిచారు. వీరిలో ప్రశాంత్, అమర్​దీప్ తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివాజీ మూడో ప్లేస్, యావర్ నాలుగో స్థానం, ప్రియాంక, అర్జున్ వరుసగా ఐదు, ఆరో ప్లేస్​లో సీజన్​ను ముగించారు.

రైతులకేఇస్తా
Pallavi Prasanth Prize Money : "రూ.35 లక్షలను రైతుల కోసం ఇస్తాను. కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్క రైతుకు ఇస్తా. పొట్ట మీద చేయి వేసుకొని చెప్తున్నా. మాట తప్పేదే లేదు. మళ్లీ వచ్చా అంటే తగ్గేదే లే. రైతుల కోసం ఆడినా, కారు నాన్నకు ఇస్తా, నక్లెస్ అమ్మకు ఇస్తా. డబ్బు జనాలకు ఇస్తా" అంటూ మరోసారి బిగ్ బాస్‌లోకి వచ్చింది డబ్బు కోసం కాదని గుర్తుచేశాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ గొప్ప మనసుకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇక తను విన్నర్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. శివాజీ ఫ్యాన్స్ సైతం ప్రశాంత్ విన్నర్ అవ్వడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాను విన్నర్ అవ్వకపోయినా తన శిష్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడంతో సంతోషపడ్డాడు శివాజీ.

అందరూ ఎమోషనల్
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ అవ్వడంతో తను హౌజ్‌లో ఎలా ఉన్నాడు, ఎలా ఆడాడు అన్న విషయాలను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటున్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, తనకు ఎంత కోపం వచ్చినా కంట్రోల్‌లో ఉంటూ నామినేషన్స్ సమయంలో మాత్రమే వాదిస్తూ ఉండేవాడు ప్రశాంత్. పల్లవి ప్రశాంత్‌తో పాటు తన తల్లిదండ్రులు కూడా స్టేజ్‌పై ఎమోషనల్ అయ్యారు.

తెలుగు బిగ్​బాస్ విన్నర్లు

  • తొలి సీజన్ (2017)- శివ బాలాజీ
  • రెండో సీజన్ (2018)- కౌశల్
  • మూడో సీజన్ (2019)- రాహుల్ సిప్లిగంజ్​
  • నాలుగో సీజన్ (2020)- అభిజిత్ దుడ్డల
  • ఐదో సీజన్ (2021)- వీజే సన్నీ
  • ఆరో సీజన్ (2022)- రేవంత్
  • ఏడో సీజన్ (2023)- పల్లవి ప్రశాంత్

Last Updated : Dec 18, 2023, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.